CM Jagan: రేపు అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:21 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.
అమరావతి, మార్చి 6: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) రేపు (గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు జగన్ (AP CM) చేరుకోనున్నారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ (YSRCP Chief Jagan) విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి జగన్ చేరుకోనున్నారు.
TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. అసలు కారణమిదే!
నేడు ప్రకాశం జిల్లాలో...
మరోవైపు ఈరోజు జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు (Veligonda Project) నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగొండ ప్రాజెక్టుకి జగన్ నిధులు కేటాయించారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: రేపే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంపిక బాధ్యత రేవంత్‌దే..
Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...