Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?
ABN , Publish Date - Mar 21 , 2024 | 12:08 PM
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు(Tamil Nadu)తో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం తమిళనాడులోని 39 స్థానాలకు గాను డీఎంకే (DMK) 24, కాంగ్రెస్ 8, సీపీఐ, సీపీఎం చెరో రెండు సీట్లు, వీసీకే, ఐయూఎంఎల్ ఒక్కో సీటు, అన్నాడీఎంకే ఒక్కో సీటు గెలుచుకున్నాయి. పొత్తులో భాగంగా పుదుచ్చెరి నుంచి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన వైతిలింగం గెలుపొందారు. లక్షద్వీప్, అండమాన్ నికోబర్‌లో ఒక్కో స్థానానికి తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో లక్షద్వీప్‌లో ఎన్‌సిపికి చెందిన మహ్మద్ ఫైసల్ గెలుపొందారు. అండమాన్ నికోబార్ కాంగ్రెస్‌కు బలమైన కోటగా ఉంది. దీంతో 42 సీట్లలో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.
తమిళనాడుపై బీజేపీ ఫోకస్..
దక్షిణాది రాష్ట్రాల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు గెలవడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తమిళనాడులోని 39 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తుంది. ఈసారి కనీసం 5 నుంచి 10 స్థానాలు ఎన్డీయే కూటమి గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులో గత బీజేపీకి ప్రస్తుత బీజేపీకి పూర్తిగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతూ వస్తోంది. పాదయాత్రలతో పాటు.. డీఎంకే అవినీతిపై ఆయన ఆరోపణలు చేస్తూ.. ఆధారాలు విడుదల చేశారు. దీంతో డీఎంకే సైతం బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోరు.. డీఎంకే, బీజేపీగా మార్చేశారు అన్నామలై. ప్రధాని మోదీ సైతం తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో తమిళనాడులో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..