Loksabha Elections: బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్.. పప్పు యాదవ్ పార్టీ విలీనం
ABN , Publish Date - Mar 20 , 2024 | 04:29 PM
లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
పాట్నా: లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ (Bihar) కాంగ్రెస్ (Congress) పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ (Pappu Yadav) ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని పప్పు యాదవ్ (Pappu Yadav) విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పప్పు యాదవ్‌ను (Pappu Yadav) లోక్ సభ ఎన్నికల బరిలో నిలుపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
లాలు, తేజస్వితో భేటీ
కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు తేజస్వి యాదవ్‌తో పప్పు యాదవ్ సమావేశం అయ్యారు. తమకు ఒకరిపై మరొకరికి శత్రుత్వం లేదని పప్పు యాదవ్ స్పష్టం చేశారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని పప్పు యాదవ్ ప్రకటించారు. తేజస్వి యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు. గత 17 నెలల బీహార్ పాలనలో తేజస్వి యాదవ్ మార్క్ కనిపించిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తేజస్వి యాదవ్ నిరంతరం పని చేశారని పప్పు యాదవ్ తెలిపారు. ఆర్జేడీని తేజస్వి మరింత బలోపేతం చేశారని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
మరిన్ని వార్తలు చూడండి.
Loksabha Elections: నాలుగోసారి వరుణ్‌కు నో..? ఇండిపెండెంట్‌గా బరిలోకి యువనేత..!!