Share News

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ నడుస్తూ వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై పేలుడు.. చివరకు..

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:54 PM

కొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలను చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటూ అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా..

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ నడుస్తూ వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై పేలుడు.. చివరకు..

కొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలను చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటూ అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా ఫుట్‌పాత్‌పై పేలుడు జరిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికా (South America) దేశంలోని పెరూలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పాదచారులు నడుస్తూ వెళ్తుంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా.. (explosion on the footpath) సడన్‌గా ఫుట్‌పాత్ కింద పేలుడు సంభవిస్తుంది.

Viral Video: వామ్మో.. ఈ హిప్పో బెదిరింపు మామూలుగా లేదుగా.. వాహనాన్ని వెంబడించి మరీ.. చివరకు..


ఈ పేలుడుతో ఫుట్‌పాత్‌పై పెద్ద రంధ్రం ఏర్పడడడంతో నడుస్తున్న మహిళ (woman fell into the hole) అందులో పడిపోతుంది. పేలుడు దాటికి ఫుట్‌పాత్‌పై సిమెంట్ పలక గాల్లోకి లేచి తిరిగి ఆమె భుజంపై పడుతుంది. అయితే ఆ సమయంలో అక్కడే ఆర్మీ సైనికుడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ ఘటనలో సదురు మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.

Viral Video: ఓటమి చెందామని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఒక్కసారి ఇతడి కష్టాన్ని చూడండి..


ఫుట్‌పాత్ కింద ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంబవించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఫుట్‌పాత్‌పై పేలుడు ఏంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 09:54 PM