Share News

Viral video: వాషింగ్‌మెషిన్‌ వద్ద మీరూ ఇలాగే చేస్తున్నారా.. ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:52 PM

ఇళ్లల్లో ఫ్యాన్లు, ఫ్రిడ్జిలు, కూలర్లు తదితరాలను వినియోగించే సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తెలిసి కొందరు, తెలీక కొందరు ..

Viral video: వాషింగ్‌మెషిన్‌ వద్ద మీరూ ఇలాగే చేస్తున్నారా.. ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..

ఇళ్లల్లో ఫ్యాన్లు, ఫ్రిడ్జిలు, కూలర్లు తదితరాలను వినియోగించే సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తెలిసి కొందరు, తెలీక కొందరు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాషింగ్‌మెషిన్ వద్ద ఓ వ్యక్తి దస్తులు వాష్ చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దస్తులు ఉతికేందుకు వాషింగ్‌మెషిన్ (Washing machine) వద్దకు వస్తాడు. అప్పటికే అందులో వేసిన దస్తులను వాష్ చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో అందులో ముందుగా సర్ఫ్ పొడిని వేస్తాడు. ఆ తర్వాత దస్తులు ఉన్న ప్రదేశంలో చేయి పెట్టి పరిశీలిస్తాడు. దీంతో అతడికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ (electric shock) కొడుతుంది. చేయి బయటికి తీయడం సాధ్యం కాక.. మెషిన్‌కు అతుక్కుపోయి చాలా సేపు విల్లవిల్లాడిపోతాడు.

Viral video: అరెరే.. ఇలా జరిగిందేంటీ.. దంపతులు రిక్షాలో కూర్చోగానే.. నడుపుదామని చూస్తే..


తర్వాత మెల్లగా మిషిన్ పక్కగా కిందకు పడిపోతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో..పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది యాక్టింగ్ మాత్రమే.. మిషిన్ డోరు తీస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది’’.. అంటూ మరికొందరు, ‘‘యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 15 , 2024 | 08:52 PM