Share News

Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతిని చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..

ABN , Publish Date - Dec 07 , 2024 | 08:53 PM

పర్యాటక ప్రదేశాలను సందర్శించే సమయంలో కొందరికి షాకింగ్ అనుభవవాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కోతుల నుంచి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ.. చూస్తుండగానే చేతిలోని విలువైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. తిరిగి వాటిని..

Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతిని చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..

పర్యాటక ప్రదేశాలను సందర్శించే సమయంలో కొందరికి షాకింగ్ అనుభవవాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కోతుల నుంచి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ.. చూస్తుండగానే చేతిలోని విలువైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. తిరిగి వాటిని తీసుకునేందకు కొందరు అష్టకష్టాలు పడుతుంటారు. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. యువతికి పైకి ఎక్కిన కోతి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) పర్యాటక ప్రదేశంలో వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఓ చేతిలో జ్యూస్ పట్టుకుని, మరో చేతిలో ఫోన్ పట్టుకుని నడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో ఎదురుగా ఉన్న ఓ కోతి యువతిని గమనిస్తుంది. చివరకు ఆమె చేతిలోని జ్యూస్‌పై కన్నేస్తుంది.

Viral Video: పిసినారి పని చేసినా వరుడిని వదలని మరదలు.. వేదికపైకి వెళ్లి మరీ..


యువతి కూడా ధైర్యంగా కోతికి పక్కగా నడుస్తూ వెళ్తుంటుంది. అయితే ఆమె దగ్గరికి రాగానే కోతి ఒక్కసారిగా ఆమె వద్దకు వెళ్లి ఫ్యాంటు పట్టుకుని పైకి ఎక్కేస్తుంది. చివరకు ఆమె చేతిపై కూర్చుని (monkey climbing young woman's hand) ఎంచక్కా జ్యూస్ మొత్తం తాగేస్తుంది. కోతి చేసిన ఈ పనికి అవాక్కైన యువతి.. తర్వాత దాన్ని వీడియో తీసుకుంటూ మురిసిపోతుంది. ఇలా ఆ కోతి యువతికి ఊహించని షాక్ ఇవ్వడం చూసి అక్కడున్న వారంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

Viral Video: పర్వతం పైకి బల్లిలా పాకుతూ వెళ్లాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి భలే స్మార్ట్‌గా ఉందిగా’’.. అంటూ కొందరు, ‘‘జ్యూస్ అంటే ఈ కోతికి బాగా ఇష్టం ఉన్నట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1480కి పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2024 | 03:57 PM