Share News

Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:50 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి ఎవరైనా సెలూన్‌కు వెళ్తుంటారు. అయితే..

Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..

‘‘నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్‌లో నే నడిచెదరో’’... అని ఓ సినీ కవి అన్నట్లు కొందరు చేసే పనులు సాధారణానికి భిన్నంగా, అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొందరు సైకిల్‌ను వాషింగ్ మెషిన్‌లా ఉపయోగిస్తే.. మరికొందరు వాడి పడేసిన పేస్ట్ ట్యూబ్‌ను కొళాయి మూతలా వాడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కటింగ్ మిషన్‌తో చేస్తున్న పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన ఇద్దరు వ్యక్తులు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి ఎవరైనా సెలూన్‌కు వెళ్తుంటారు. అయితే ఈ పాకిస్థాన్‌ వ్యక్తులు మాత్రం.. ‘‘సెలూన్‌కు ఎందుకు ఖర్చులు దండగ’’.. అని అనుకున్నారో ఏమో గానీ.. వారు పని చేస్తున్న స్థలంలో ఆ పనితో పాటూ షేవింగ్ కూడా కానిచ్చేశారు.

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. ఈ చిరుత పులి చేసిన పని చూస్తే..


గడ్డం, మీసాలు ట్రిమ్ (Beard trimming) చేసుకోవడానికి విచిత్రంగా ఆలోచించారు. ఓ వ్యక్తి తన చేతిలోని కటింగ్ మెషిన్‌తో (cutting machine) ఎదురుగా ఉన్న వ్యక్తికి మీసాలు, గడ్డం ట్రిమ్ చేస్తాడు. కటింగ్ మెషిన్‌ను అతడి మీసాలపై పెట్టి అటూ, ఇటూ తిప్పుతూ ట్రిమ్ చేస్తాడు. చాలా సేపు ఎంతో జాగ్రత్తగా మీసాలను ట్రిమ్ చేసేశాడు.

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..


ఇలా రూపాయి ఖర్చు చేయకుండా కటింగ్ మిషన్‌తో ఫ్రీగా మీసాలను ట్రిమ్ చేసేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటివి పాకిస్థాన్‌లోనే సాధ్యమేమో’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 03:50 PM