AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి హైకోర్టు మెట్లు ఎక్కాడు
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:57 PM
జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్‌ని రద్దుచేయమంటూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) అన్నారు. దాన్ని తిరస్కరిస్తూ హైకోర్ట్ తీర్మానం ఇచ్చిందని చెప్పారు.
హైదరాబాద్: జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్‌ని రద్దుచేయమంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మెట్లు ఎక్కాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) అన్నారు. దాన్ని తిరస్కరిస్తూ హైకోర్ట్ తీర్మానం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్, నర్సింహారెడ్డి కమిషన్‌కి హాజరు కావాలని ఖచ్చితంగా నిజాలు బయటకు రావాలని అన్నారు.
కేసీఆర్ ఈ విచారణ జరపమని సవాల్ విసిరి ఇప్పుడు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగంగా తక్కువ ధరకు దొరుకుతున్నా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఆది శ్రీనివాస్ తెలిపారు.
2014లో తీవ్ర విద్యుత్ కొరత: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో 2014 తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఎన్నో ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కూడా అవినీతి జరిగిందని అన్నారు.
ఈ నిజలన్నీ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌లో బయటపడతాయనే కేసీఆర్ భయపుడుతన్నారని విమర్శించారు. తెలంగాణ ఓటర్లకు తెలివి లేదని, ఆంధ్ర ఓటర్లకు తెలివి ఉందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఓటర్లకు, ఆంధ్ర ఓటర్లకు తెలివి ఉంది కాబట్టే రెండు రాష్ట్రాల్లో రజాకార్ల పాలనను తొలగించి ప్రజా పాలనను ఎంచుకున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని త్వరలో అన్ని సాక్ష్యాలతో ఎలక్షన్ కమిషన్ ముందుకి వెళ్తామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి....
KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి
AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..
KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ
Read Latest Telangana News AND Telugu News