Share News

Bhatti Vikramarka: హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 22 , 2024 | 07:47 PM

హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి , తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. బొగ్గు వేలంపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని .. వారి వల్లే బొగ్గు వేలం చట్టం వచ్చిందని చెప్పారు.

Bhatti Vikramarka: హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి  కేంద్రం నిధులు ఇవ్వాలి
Bhatti Vikramarka

ఢిల్లీ: హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి , తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. బొగ్గు వేలంపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని .. వారి వల్లే బొగ్గు వేలం చట్టం వచ్చిందని చెప్పారు. బొగ్గు వేలం ఆపితే ఇల్లందు, సత్తుపల్లి గనులు ఎందుకు పోయాయని ప్రశ్నించారు. సింగరేణికి నష్టం జరిగేలా తమ సొంత వారికీ గనులు వచ్చేలా బీఆర్ఎస్ అధిష్ఠానం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. అంతర్గత వనరులు సమీకరించుకుని తాము రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.


కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రీ బిడ్జెట్,జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు(శనివారం) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిధులు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.


సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలని కోరారు. సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చేయాలన్నారు. రాష్ట్రాల నికర రుణపరిమితి సీలింగ్ ముందుగానే చెపితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గత ఏడాది తెలంగాణకు 1.4 శాతమే నిధులు వచ్చాయని తెలిపారు. ఉపాధి హామీ నిధులు ఆస్తుల సృష్టి పనులకు వినియోగించేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. మూసి రివర్ ఫ్రంట్‌కు నిధులు కేటాయించాలని కోరామని భట్టి విక్రమార్క అన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 07:47 PM