Share News

KTR: హరీష్‌రావు ఇంటి వద్ద హైడ్రామాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 17 , 2024 | 10:03 AM

Telangana: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామాపై ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హరీష్‌రావు ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందన్నారు.

KTR: హరీష్‌రావు ఇంటి వద్ద హైడ్రామాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 17: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామాపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. హరీష్‌రావు ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!


తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తోందని విమర్శించారు. ఇదేనా రాహుల్ గాంధీ వల్లే వేస్తున్న మొహబ్బత్ కా దుకాణ్ అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


అసలేం జరిగిందంటే..

కాగా... సిద్ధిపేటలో అర్థరాత్ర ఫ్లెక్సీ వార్ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సిద్ధిపేటలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘రూ. 2 లక్షల రుణమాఫీ అయింది. నీ రాజీనామా ఎటు పాయె.. అబద్ధాల హరీశ్ రావు’ అంటూ సిద్ధిపేట కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ పేరిట పట్టణంలో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.ఫ్లెక్సీలను తొలగించాలని బీజేఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో బీజేఆర్ చౌరస్తాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆందోళనలతో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

AP Politics: జగన్‌‌ను అరెస్ట్ భయం వెంటాడుతోందా..!



హరీష్‌రావు ఫైర్...

కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ... కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: అమెరికా కల.. సాకారం ఇలా..

CM Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలవనున్నారంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 17 , 2024 | 10:09 AM