Share News

KTR: ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా.. రేవంత్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:22 PM

సీఎం రేవంత్‌రెడ్డికు (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు( మంగళవారం) బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.

KTR: ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా.. రేవంత్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు
KTR

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికు (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు( మంగళవారం) బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పది ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు.


ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా అని ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు- సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం కనపడుతోందని చెప్పారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే  రేవంత్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం తమపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని కేటీఆర్ హితవు పలికారు.

Updated Date - Jun 24 , 2024 | 07:27 PM