KTR: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:37 PM
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కి (Bandi Sanjay Kumar) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈరోజు (గురువారం) బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కి (Bandi Sanjay Kumar) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈరోజు (గురువారం) బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయి చూపిందని మండిపడ్డారు.
ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తెప్పించాలని కోరారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని అన్నారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.