Minister Uttam: కాళేశ్వరంపై ఈ వారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం
ABN , Publish Date - Jan 02 , 2024 | 08:34 PM
కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project )పై ఈ వారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు. మంగళవారం నాడు సెక్రటేరియట్ మీడియా సెంటర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి అవినీతికి పాల్పడ్డాయన్నారు. కాళేశ్వరంపై పదేళ్ల నుంచి సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డ్యామేజ్ రిపేర్ చేసే బాధ్యత ఏజెన్సీదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project )పై ఈ వారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు. మంగళవారం నాడు సెక్రటేరియట్ మీడియా సెంటర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్( BRS ), బీజేపీ ( BJP ) కలిసి అవినీతికి పాల్పడ్డాయన్నారు. కాళేశ్వరంపై పదేళ్ల నుంచి సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డ్యామేజ్ రిపేర్ చేసే బాధ్యత ఏజెన్సీదేనని చెప్పారు. కిషన్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ 3500 రోజులు సన్నిహితంగా గడిపి 20 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. ‘మీరు దోచుకొండి, మా వాట మాకు ఇవ్వండి’ అని కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పిందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన నిబంధనలు మార్చుకొని కేసీఆర్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కిషన్‌రెడ్డికి కామన్ సైన్స్ ఉండాలి
మేడిగడ్డపై మాట్లాడానికి కిషన్‌రెడ్డికి కామన్ సైన్స్ ఉండాలని చెప్పారు. మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కిషన్‌రెడ్డి కనీసం విజిట్ కూడా చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోతే కేంద్రమంత్రి సైలెంట్‌గా ఉన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెంచిన అంచనాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే లోన్ ఇచ్చిందన్నారు. కాళేశ్వరంపై ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేసులు వేసిన కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్‌పై విచారణ ఎందుకు జరపలేదని నిలదీశారు. కాళేశ్వరం తప్పులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ అప్లయ్ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.