TS News: ఇదేందయ్యా మల్లారెడ్డి.. అన్నంలో పురుగులంటూ విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:18 PM
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గండి మైసమ్మలోని ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది.
మేడ్చల్, మార్చి 5: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో (Mallareddy Engineering College) ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గేటు ముందు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది. నిన్న (సోమవారం) రాత్రి అన్నం, ఇతర ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చాయంటూ విద్యార్థినిలు క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. గత నెల రోజుల వ్యవధిలో విద్యార్థులు ఆందోళనకు దిగడం ఇది మూడో సారి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు సర్ధిచెప్పడంతో వివాదం ముగిసింది.
TS Highcourt: శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్ట్
అయితే.. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా దిగాయి. అయితే మరోసారి పురుగులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని మల్లారెడ్డి (Former Minister Mallareddy) హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనక్కి తగ్గారు. అయితే ప్రతీసారి అదే రిపీట్ అవుతుండటం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
CM Jagan: మరీ ఇంత కక్షా?.. మరోసారి రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్
YCP: వైసీపీకి మంత్రి రాజీనామా.. జగన్ విగ్రహంగా మారారంటూ సంచలనం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...