TSRTC: చెప్పుకోండి చూద్దామంటూ సజ్జనార్ వెరైటీ క్వశ్చన్.. ఆన్సర్ ఇచ్చేయండి మరి
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:38 AM
Telangana: తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ‘‘మీ మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
హైదరాబాద్, మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో మొదట అమలు అయ్యింది మాత్రం ‘‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’’. సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు స్వీకరించిన తర్వాతి రోజే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ‘‘మహాలక్ష్మి’’ పథకం పేరుతో ఇది కొనసాగుతోంది. దీంతో గడిచిన మూడు నెలలుగా పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. మహిళలతో బస్సులు కిక్కిరిపోతున్నాయి. ఈ పథకంతో రేవంత్ సర్కార్‌ను మహిళలు ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కూడా.
PM Modi: 8 లైన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. నేడు జాతికి అంకితం
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేస్తూ మీ ‘‘మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
సజ్జనార్ ట్వీట్ ఇదే...
‘‘ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకంపై వచ్చిన ప్రశ్న ఇది. మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి..చూద్దాం!?’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేస్తూ ప్రశ్నాపత్రాన్ని షేర్ చేశారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే?...
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే పథకం గురించి కింద వాటిలో ఏవి సరైనవి కావు? అనేది ప్రశ్న.
1. ఈ పథకం పేరు ‘‘శ్రీ లక్ష్మీ పథకం’’
2. ఇది బాలికలు, అన్ని వయసుల మహిళలు మరియు లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది.
3. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) తెలంగాణ గడ్డపై నడిచే అన్ని బస్సుల్లో మహిళా ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
4. ఈ పథకం ఆదివారాలు మినహా అన్ని రోజులలో అందుబాటులో ఉంటుంది.
ఎ. (1), (3) మరియు (4) బి. (1) మరియు (3)
సి. (1), (2) మరియు (4) డి. (3) మరియు (4)
సో.. ఇదండి ప్రశ్న. ఇంకెందుకు ఆలస్యం... ఈ నాలుగింటిలో సరైన సమాధానం ఏదో చెప్పేయండి మరి..
ఇవి కూడా చదవండి...
Andhra Pradesh: పోలీసుల్లో ‘ట్యాపింగ్’ పరేషాన్!
Congress: కాంగ్రెస్ రెండో జాబితా రేపు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...