Marri Rajasekhar: నన్ను అవమానించారు.. విడదల రజినీపై మర్రి రాజశేఖర్ ఫైర్
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:40 PM
Marri Rajasekhar: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీపై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజినీని చిలకలూరిపేట ఇన్‌చార్జ్‌ని చేశారని మండిపడ్డారు.

అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీ(Vidadala Rajini)పై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (YSRCP MLC Marri Rajasekhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గుర్తింపు లేదు.. తనను చులకనగా చూశారని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి తాను వెళ్లిపోవడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వైఖరీనే కారణమని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదని మర్రి రాజశేఖర్ చెప్పారు. 2023 చివర్లో ఎమ్మెల్సీ ఇచ్చారని మర్రి రాజశేఖర్ గుర్తుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజినీని చిలకలూరిపేట ఇన్‌చార్జ్‌ని చేశారని చెప్పారు. రజినీని బలోపేతం చేయడానికి తనను అవమానించారని మండిపడ్డారు. త్వరలో టీడీపీలో చేరుతానని మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
విడదల రజినీ ఏమన్నారంటే..
వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీ (Vidadala Rajini) స్పందించారు. మర్రి రాజశేఖర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని విడదల రజనీ అన్నారు. మర్రి కుటుంబానికి వైఎస్ కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చిందని తెలిపారు. మర్రి గెలుపు కోసం వైఎస్సార్ ప్రచారం చేశారని గుర్తుచేశారు. రెడ్‌బుక్ పాలనలో తన వాయిస్ వినిపించి ఉంటే.. మర్రి గౌరవం ఇంకా పెరిగి ఉండేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబితేనే తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని విడదల రజినీ తెలిపారు.
టీడీపీలోకి మర్రి రాజశేఖర్..
మర్రి రాజశేఖర్ రాజీనామా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను మర్రి రాజశేఖర్ కోరారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో టీడీపీలో (TDP) చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామాకు ముందు రాజశేఖర్‌ను వైసీపీ అగ్రనేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. అయితే తాను టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని మర్రి రాజశేఖర్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..
AP News: ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు
Read Latest AP News And Telugu News