MLA Prathipati Pulla Rao: అవినీతి చేసి నీతులు చెబుతారా.. విడదల రజనీపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:21 PM
MLA Prathipati Pulla Rao: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటకు అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు.

పల్నాడు జిల్లా: మాజీమంత్రి, వైసీపీ నేత విడదల రజనీకు తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఈ రోజు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఇవాళ (సోమవారం) ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు, దుర్మార్గాలు చేసి, ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీ పరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు పేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
కేసులు పెట్టిన వారిని తిరిగి డబ్బులిస్తామని ఎందుకు బతిమాలుకుంటున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చేసిన తప్పులు కడుక్కోవడానికి జీవితం సరిపోదు, సొంతపార్టీ వారే ఇంకా క్యూలో ఉన్నారని తెలిపారు. అవినీతి చేయకుంటే రాయబారాలు ఎందుకు చేస్తున్నారని అన్నారు. తనవద్దకు మనుషులను పంపారని ఎంపీ చెప్పలేదా అని ప్రశ్నించారు. వారు చేసిన దోపిడీని సహించలేక సొంతపార్టీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా అని నిలదీశారు. చిలకలూరిపేటకు అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు. పిల్లికోటి వ్యవహారంలో చట్టబద్ధమైన చర్యలుం ఉంటాయని చంద్రబాబు ఎప్పుడో చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు తప్పు చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. విడదల రజనీ చేసిన తప్పులు ఎక్కడికి పోతాయని నిలదీశారు. చట్టప్రకారం అందరూ శిక్షార్హులేనని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News