Share News

9 AM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:56 AM

ఆంధ్రజ్యోతి.కామ్‌లో శుక్రవారం ఉదయం 9గంటల వరకు ఉన్న టాప్ టెన్ వార్తలు ఇవే..

9 AM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..
Top 10 News 9 PM

1) చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్.. మరో మహమ్మారి రాబోతుందా..

మీకు కరోనా వైరస్ గుర్తుందా? ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం జరిగింది. ప్రతి దేశం అల్లాడిపోయింది. లక్షల మంది చనిపోయారు. చైనా చేసిన ఒక్క తప్పిదం మినహా యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు చైనాలో మరోసారి కొత్త వైరస్ భీభత్సం సృష్టిస్తోంది. చైనా(china)లోని ఆసుపత్రుల్లో అనేక మంది బారులు తీరారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


2) సంక్రాంతికి ముందే హైదరాబాదీలకు మరో పండగ.. నేటి నుంచి ప్రారంభం

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ జోష్‌లో ఉండగానే హైదరాబాదీలను ఖుషీ చేసేందుకు మరో పండగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండగ నేటి నుంచే ప్రారంభమైంది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. నుమాయిష్. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న స్థానికులు మొదలుకుని ప్రముఖ కంపెనీల వరకూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


3) రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture case)లో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు (Kamepalli Tulasibabu)ను శుక్రవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామ గుండెలపై తులసిబాబు కూర్చొని టార్చర్ చేశాడని ఆరోపణ నేపథ్యంలో అతనిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


4) రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ మీల్స్.. ఎవరెవరి కంటే..

పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని చంద్రబాబు సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తోంది. "తల్లికి వందనం" పథకం కింద రూ.15 వేలు ఇవ్వాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


5) బాబాయ్‌,అబ్బాయ్‌ మధ్య సయోధ్య!

మహారాష్ట్ర ఎన్‌సీపీలోని వైరివర్గాలు ఒక్కటి కాబోతున్నాయా? కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బాబాయి శరద్‌ పవార్‌, అబ్బాయి అజిత్‌ పవార్‌ విభేదాలు మరచి రాజీపడబోతున్నారా..? అజిత్‌ తల్లి ఆశా తాయి, ఆయన వర్గం ఎన్‌సీపీ అగ్రనేత ప్రఫు ల్‌ పటేల్‌ వ్యాఖ్యలు ఈ సంకేతాలే ఇస్తున్నాయి. ఆశా తాయి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవా రం పండరీపురంలో పాండురంగ విఠలుడి ఆలయం వె లుపల మీడియాతో మాట్లాడుతూ.. బాబాయి, అబ్బాయి తిరిగి కలవాలని, కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోవాలని పాండురంగడిని వేడుకున్నానని తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


6) సెకనుకు 100 జీబీ డేటా!

అత్యంత వేగంగా డేటాను సరఫరా(ట్రాన్స్‌మిట్‌) చేయడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఈ విషయంలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ను అధిగమించినట్లు ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ తెలిపింది. చైనాకు చెందిన చాంగ్‌ గ్వాంగ్‌ శాటిలైట్‌ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్‌మిట్‌ చేసేలా అత్యాధునిక హైరిజల్యూషన్‌ స్పేస్‌ టు గ్రౌండ్‌ లేజర్‌ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


7) షాకింగ్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం(gold), వెండి (silver) ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కొత్త సంవత్సరం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. కొత్త ఏడాది మూడో రోజు బంగారం ధర రూ. 330 పెరిగింది. శుక్రవారం జనవరి 3, 2025న ఉదయం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగింది. దీంతో దేశంలోని చాలా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,400కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,900గా ఉంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


8) పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ శుభవార్త ప్రకటించింది. సెక్షన్ 87A పన్ను మినహాయింపు అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు క్లెయిమ్ చేయడానికి తాజాగా అవకాశం లభించింది. ఈ ప్రకటన డిసెంబర్ 31, 2024న ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన పన్ను చెల్లింపుదారులు సవరించిన లేదా ఆలస్యమైన ITRను ఫైల్ చేసి 87A పన్ను మినహాయింపును పొందవచ్చు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


9) శంకర్ గారు ఆ హక్కులు నాకే చెందాలి.. రాజమౌళి

సినిమా వేదికలపై పొగడ్తల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోలను దర్శకనిర్మాతల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ వరకూ హద్దుకు మించి పొగడ్తల వర్షంలో ముంచేస్తారు. కానీ హీరోని హీరోని మెచ్చుకోవడం, ఓ దర్శకుడి గురించి మరో టాప్‌ దర్శకుడు గొప్పగా చెప్పడంతో ఎప్పుడోగానీ జరగదు. వారి మధ్య మంచి స్నేహం, రాపో ఉంటే తప్ప ఓ దర్శకుడి గురించి గొప్ప మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి సీన్‌ గురువారం జరిగిన గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) ట్రైలర్‌ ఆవిష్కరణలో కనిపించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


10) మరోసారి టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం.. స్కోర్ ఏంతంటే..

టీమిండియా (team india), ఆస్ట్రేలియా (Australia) మధ్య ఈరోజు(జనవరి 3, 2025న) మొదలైన చివరి టెస్టు మ్యాచ్‌లో కూడా భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. టీమిండియా మంచి పోటీ ఇవ్వాలని భావించినప్పటికీ, మొదటి ముగ్గురు కీలక ఆటగాళ్లు ఇప్పటికే ఔట్ కావడం భారత జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో 21 ఓవర్లలోనే 57 పరుగులు చేయగానే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి, భారత జట్టు 57 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 03 , 2025 | 09:57 AM