Share News

Trafficking Viral Video: అనుమానాస్పదంగా ప్రయాణికుడి హెయిర్‌ స్టైల్.. చివరకు మొత్తం కత్తిరించి చూడగా..

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:39 PM

విమానం ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా వెళ్తు్న్నారు. అయితే వారిలో ఓ కొలంబియన్‌ హెయిర్ స్టైల్ విచిత్రంగా కనిపించడంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. చివరకు జుట్టు మొత్తం కత్తిరించి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

Trafficking Viral Video: అనుమానాస్పదంగా ప్రయాణికుడి హెయిర్‌ స్టైల్.. చివరకు మొత్తం కత్తిరించి చూడగా..

బస్సు, రైలు, విమానాశ్రాయాల్లో జరిగే తనిఖీల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు వెలుగుచూస్తుంటాయి. కొందరు అధికారుల కళ్లుగప్పి అక్రమ రావాణాకు పాల్పడడం చూస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు అత్యంత తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. కొందరు ఏకంగా తమ శరీర భాగాల్లో డ్రగ్స్, బంగారు తదితర వస్తువులను పెట్టుకుని పట్టుబడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విమానాశ్రయంలో ఓ వ్యక్తి హెయిర్ స్టైల్ చూసి అధికారులకు అనుమానం కలిగింది. చివరకు జుట్టు కత్తిరించగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కొలంబియాలోని (Colombia) రాఫెల్ నూనెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్థానిక విమానాశ్రయం నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్ వెళ్లే విమానం ఎక్కేందుకు సోమవారం ప్రయాణికులు ఒక్కొక్కరుగా వెళ్తు్న్నారు. అయితే వారిలో ఓ కొలంబియన్‌ హెయిర్ స్టైల్ విచిత్రంగా కనిపించడంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని జుట్టు కత్తించారు.

Train Viral Video: ఈ డ్రైవరేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. రైలును ఆపి మరీ పట్టాల మధ్యలో..


తీరా జుట్టులో గమనించగా తల మధ్యలో కొంత భాగంలో విగ్ అతికించినట్లు కనిపించింది. చివరకు విగ్ తీసి చూడగా అందులో షాకింగ్ సీన్ కనిపించింది. మొత్తం 10 కొకైన గుళికలను అందులో (Cocaine trafficking in wig) దాచినట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు 10,000 యూరోలు (రూ. 9.1 లక్షలు) ఉంటుందని అధికారులు తెలిపారు. బార్సిలోనా అంతర్జాతీయ విమానాశ్రయంలో గతంలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ వ్యక్తి సుమారు అరకిలోకి పైగా కొకైన్‌ను విగ్‌లో దాచి తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

Viral Dustbin Video: చెత్తను బంగారం చేశారుగా.. ఈ పెళ్లిలో ఏర్పాట్లు చూస్తే శభాష్ అనాల్సిందే..


కాగా, ప్రస్తుతం రాఫెల్ నూనెజ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీడేంట్రా మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2025 | 01:39 PM