Share News

Train Viral Video: ఈ డ్రైవరేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. రైలును ఆపి మరీ పట్టాల మధ్యలో..

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:01 PM

ఓ లోకల్ రైలు ఉన్నట్టుండి దారి మధ్యలో ఆగిపోయింది. ఏమైందో అని ప్రయాణికులంతా చర్చించుకుంటున్నారు. ఇంతలో డ్రైవర్ ఇంజిన్ నుంచి కిందకు దిగాడు. చివరకు రైలు పట్టాల మధ్యలో తడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Train Viral Video: ఈ డ్రైవరేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. రైలును ఆపి మరీ పట్టాల మధ్యలో..

రైలు ప్రయాణంలో చాలా మంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. డోరు వద్ద వేలాడుతూ కొందరు, ఏకంగా బోగీలపైకి ఎక్కుతూ మరికొందరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ రైలు డ్రైవర్ చేసిన విచిత్ర నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. రైలును ఆపిన డ్రైవర్ పట్టాల మధ్యలో అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ డ్రైవరేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ముంబై - ఉల్హాస్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్ల మధ్య నడిచే లోకల్ రైలు (Local train) ఉన్నట్టుండి దారి మధ్యలో ఆగిపోయింది. ఇంతలో ఇంజిన్ నుంచి కిందకు దిగిన డ్రైవర్.. ముందు వైపు పట్టాల మధ్యలో మూత్రవిసర్జన చేశాడు. అనంతరం మళ్లీ ఇంజిన్ ఎక్కి స్టార్ట్ చేశాడు.

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. సాధారణంగా లోకోపైలెట్లు మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినప్పుడు.. కంట్రోల్ రూమ్‌కు SOS పంపితే.. తర్వాత వచ్చే స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తారట. అయితే ఈ లోకోపైలెట్ మాత్రం (driver urinating in middle of train tracks) ఇలా రైలు ఆపి మరీ పట్టాల మధ్యలో మూత్రవిసర్జన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఇది సహజమైన చర్య అని, ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది.

Viral Dustbin Video: చెత్తను బంగారం చేశారుగా.. ఈ పెళ్లిలో ఏర్పాట్లు చూస్తే శభాష్ అనాల్సిందే..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డ్రైవర్ కూడా మనిషే కదా.. ఇంజిన్‌లో సౌకర్యాలు కల్పిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు’’.. అంటూ కొందరు, ‘‘రైల్వేలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌‌లు, 6.29 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: ఈ పెళ్లిలో అంతా రివర్స్‌లా ఉందే.. వధూవరుల వద్ద ఏం జరుగుతుందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2025 | 01:01 PM