Share News

Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద కదలిక.. ఏముందా అని బయటికి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 10:56 AM

కొందరు నదిలో పడవపై షికారుకు వెళ్లారు. ఓ వ్యక్తి ఏకంగా అందులో స్నానం చేసేందుకు సిద్ధమయ్యాడు. పడవ నుంచి నీటిలోకి దిగి ఈత కొట్టాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద కదలిక.. ఏముందా అని బయటికి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

స్విమ్మింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరికి ఇలాంటి సమయాల్లో షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. స్నానం చేస్తుండగా కొన్నిసార్లు పాములు ఎంటరైతే.. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద చేపలు దాడి చేయడానికి వస్తుంటాయి. అయినా చాలా మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా... కాళ్ల కింద కదలిక కనిపించింది. ఏంటా అని బయటికి తీసి చూడగా... షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు నదిలో (River) పడవపై షికారుకు వెళ్లారు. ప్రకృతి అందాలను వీక్షిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఏకంగా అందులో స్నానం చేసేందుకు సిద్ధమయ్యాడు. పడవ నుంచి నీటిలోకి దిగి ఈత కొట్టాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..


కాళ్ల కింద ఏదో కదలిక రావడంతో అనుమానం కలిగింది. ఏముందా.. అని కాళ్లకు తగిలిన దాన్ని బయటికి తీసి చూడగా.. ఏకంగా మొసలి (Crocodile) నోరు తెరచి కనిపించింది. దాన్ని చూడగానే భయంతో దూరంగా విసిరేశాడు. ఆ తర్వాత పరుగు పరుగున వచ్చి పడవలో పడిపోయాడు. ఇలా మొసలి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడన్నమాట.

Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. సింపుల్ టెక్నిక్‌తో బట్టలు ఎలా ఉతుకుతున్నాడో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చావును అత్యంత దగ్గరగా చూడడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘యమరాజు లీవ్‌లో ఉన్నట్టున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89వేలకు పైగా లైక్‌లు, 3.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పామేంటీ ఇలా మారిపోయింది.. ఫోన్ చూడగానే దగ్గరికి వెళ్లి మరీ..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 11:04 AM