Viral Video: వీడియో కాల్ చేస్తూ.. నీటిలో మునుగుతున్న యువతి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:48 AM
దైవ దర్శనం కోసం వెళ్లిన ఓ యువతి.. ముందుగా నదిలో పుణ్య స్నానం చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

కొందరు తెలిసి, మరికొందరు తెలీక ఏవేవో పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో కాల్ చేస్తున్ యువతి.. చివరకు ఉన్నట్టుండి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ యువతేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దైవ దర్శనం కోసం వెళ్లిన ఓ యువతి.. ముందుగా నదిలో పుణ్య స్నానం చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Lion Viral Video: గాండ్రిస్తూ రోడ్డు పైకి వచ్చిన సింహం.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
వీడియో కాల్ చేసిన ఆమె.. తనతో పాటూ ఆ వ్యక్తికి కూడా స్నానం చేయించాలనే (woman dipped phone in water) ఉద్దేశంతో చివరకు నీటిలో ఫోన్‌ను ముంచేసింది. వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి చూస్తుండగా.. ఫోన్‌ను మూడు సార్లు నీటిలో ముంచి తీసింది. ఇలా ఆమె స్నానం చేయడంతో పాటూ ఆ వ్యక్తికి కూడా స్నానం చేయించిదన్నమాట. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విదేశాల్లో ఉంటున్న ఆమె భర్తకు కూడా స్నానం చేయించినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘అతను చేసిన పాపాలన్నింటీనీ ఇలా శుభ్రం చేసేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 9.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..