Viral Dustbin Video: చెత్తను బంగారం చేశారుగా.. ఈ పెళ్లిలో ఏర్పాట్లు చూస్తే శభాష్ అనాల్సిందే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:03 AM
ఓ వివాహ కార్యక్రమంలో భోజనాల వద్ద డస్ట్ బిన్ పెట్టారు. డస్ట్ బిన్ పెట్టడంలో వింతేముందీ.. అని మీరు అనుకోవచ్చు. వారు అందరిలా సాధారణంగా డస్ట్ బిన్ కాకుండా.. చెత్త విలువను తెలిపేలా వినూత్న ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

ఎంత అవగాహన కల్పించినా చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయడం సర్వసాధారణమైంది. కొందరు మరీ దారుణంగా రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని పారేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే మరికొందరు మాత్రం అందరికీ వినూత్నంగా అవగాహన కల్పిస్తూ చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తుంటారు. అలాగే చెత్త సేకరణ కార్యక్రమాలను వినూత్నంగా చేపడుతుంటారు. తాజాగా, ఓ పెళ్లిలో ఇలాగే చేశారు. చెత్త సేకరణ కోసం వారు చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో భోజనాల వద్ద డస్ట్ బిన్ పెట్టారు. డస్ట్ బిన్ పెట్టడంలో వింతేముందీ.. అని మీరు అనుకోవచ్చు. వారు అందరిలా సాధారణంగా డస్ట్ బిన్ కాకుండా.. చెత్త విలువను తెలిపేలా ఏకంగా పెద్ద ఇనుప ట్రంకు పెట్టెను (Iron trunk box) ఏర్పాటు చేశారు.
Marriage Funny Video: ఈ పెళ్లిలో అంతా రివర్స్‌లా ఉందే.. వధూవరుల వద్ద ఏం జరుగుతుందో మీరే చూడండి..
చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా భద్రంగా ఉంచి వాహనాలకు అందజేయాలనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. సాధణానికి భిన్నంగా వీరు ఇలా చెత్త (Garbage) కోసం ట్రంకు పెట్టెను ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా నిర్వాహకులను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
Viral Video: వీడియో కాల్ చేస్తూ.. నీటిలో మునుగుతున్న యువతి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి చెత్తను బంగారంగా చేశారుగా’’.. అంటూ కొందరు, ‘‘చెత్తను ఇలా సేకరించడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 2.34 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Dressing Viral Video: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఇతడి వస్త్రధారణ చూస్తే ఖంగుతినాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..