Marriage Viral Video: వివాహ వేదికపై సంతోషంగా ఉన్న వరుడు.. సడన్‌గా దగ్గరికొచ్చిన ప్రియురాలు.. చివరకు..
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:31 AM
వివాహ కార్యక్రమంలో వరుడు సూటు, బూటుతో పాటూ తలపాగా ధరించి సంతోషంగా ఫొటోలకు ఫోజులు ఇస్తుంటాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అతడి మాజీ ప్రియురాలు సడన్‌గా వేదికపైకి ఎక్కడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..

వివాహాలు జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు కావాలని ప్లాన్ చేసి మరీ ప్రాంక్ వీడియోలు చేస్తే.. మరికొన్నిసార్లు ఊహించని విధంగా షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. తాజాగా, ఓ పెళ్లిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివాహ వేదికపై వరుడు సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా ప్రియురాలు వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వరుడు సూటు, బూటుతో పాటూ తలపాగా ధరించి సంతోషంగా ఫొటోలకు ఫోజులు ఇస్తుంటాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అతడి మాజీ ప్రియురాలు (ex girlfriend) సడన్‌గా వేదికపైకి ఎక్కుతుంది. వరుడి దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని నిలదీస్తుంది.
ప్రియురాలు సడన్‌గా రావడంతో వరుడు (groom) ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆమె మాత్రం గట్టిగా పట్టుకుని మరీ అతడితో వాదిస్తుంది. ఇంతలో పక్కన ఉన్న వారు కలుగజేసుకుని ఆమెను వేదిక పైనుంచి కిందకు దింపేస్తారు. కిందకు దించిన తర్వాత కూడా ఆమె కోపంగా వరుడి వైపు చేయి చేూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. వరుడి బంధువులు ఆమెకు సర్దిచెప్పి చివరకు పక్కకు పంపిచేస్తారు.
Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు’’.. అంటూ కొందరు, ‘‘వరుడు భయపడుతున్నాడంటే.. తప్పు అతడిలోనే ఉందన్నమాట’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 8.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..