Share News

Viral Video: అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా.. ఈ బాలుడి విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:02 AM

ఓ బాలుడు ఇటుకలతో వినూత్న ప్రయోగం చేసేందుకు ముందుకొచ్చాడు. ముందుగా ఒక ఇటుపై రెండు ఇటుకలను క్రాస్‌గా ఏర్పాటు చేశారు. వాటిపై మళ్లీ నాలుగు ఇటుకలను ఒకదానిపై మరొకటి పేర్చేశారు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత..

Viral Video: అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా.. ఈ బాలుడి విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..

కొందరు చిన్న వయసులోనే అత్యంత మెరుగైన తెలివితేటలు కలిగి ఉంటారు. మరికొందరు పెద్ద వారు కూడా చేయలేని పనులు ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరు పిల్లలు చేసే పనులు చూస్తే.. ‘‘ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లాడి వినూత్న విన్యాసం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు ఇటుకలతో వినూత్న ప్రయోగం చేసేందుకు ముందుకొచ్చాడు. ముందుగా ఒక ఇటుపై రెండు ఇటుకలను క్రాస్‌గా ఏర్పాటు చేశారు. వాటిపై మళ్లీ నాలుగు ఇటుకలను ఒకదానిపై మరొకటి పేర్చేశారు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత.. ఆ బాలుడు అక్కడికి వచ్చి కింద ఉన్న ఇటుకను నోటితో పట్టుకుని, అన్ని ఇటుకలను పైకి ఎత్తేశాడు.

Road Accident Video: ఇందులో తప్పు ఎవరిదో చెప్పగలరా.. రోడ్డుపై వస్తున్న బైక్.. సడన్‌గా మధ్యలోకి వచ్చిన ఆటో.. చివరికి..


కేవలం తన నోటిపైనే అన్ని ఇటుకలనూ ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తాడు. అంతటితో ఆగకుండా (boy lifted bricks with his teeth) వాటిని మోసుకుంటూ చాలా దూరం నడుస్తూ వెళ్తాడు. అయినా ఇటుకల్లో ఒక్కటి కూడా కిందపడకుండా మోసుకుంటూ వెళ్తాడు. ఇలా ఆ బాలుడు తన దంతాలతో అన్ని ఇటుకలను బ్యాలెన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Python Attack: కొండచిలువను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. అవి దంతాలా లేక ఇనుప కడ్డీలా’’.., ‘‘ఈ బాలుడు ఖచ్చితంగా వేప పుల్లతోనే బ్రష్ చేసి ఉండాలి’’.., ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’’.., ‘‘నాసా నంచి ఇతడికి 69 మిస్ట్‌డ్ కాల్స్ వచ్చి ఉంటాయి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తుంటారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2025 | 11:02 AM