Share News

Raccoon: మనుషుల్ని మించిపోయిందిగా.. ఈ రాకూన్ కుక్క తెలివి చూస్తే.. కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:59 PM

ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ రాకూన్ కుక్క పెద్ద కంటైనర్‌లో పడిపోయింది. కంటైనర్ చాలా ఎత్తుగా ఉండడంతో బయటికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో రాకూన్.. చాలా రకాలుగా ప్రయత్నించింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Raccoon: మనుషుల్ని మించిపోయిందిగా.. ఈ రాకూన్ కుక్క తెలివి చూస్తే.. కళ్లు తేలేస్తారు..

కొన్ని జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. అలాగే మరికొన్ని జంతువులు మనుషులు కూడా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని జంతువులు మనుషులు కూడా చేయలేని పనులను ఎంతో తెలివిగా చేసేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కంటైనర్‌లో పడిపోయిన రాకూన్ కుక్క చివరికి బయటికి వచ్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ రాకూన్ మనుషుల్ని మించిపోయిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ రాకూన్ కుక్క (raccoon dog that fell into container) పెద్ద కంటైనర్‌లో పడిపోయింది. కంటైనర్ చాలా ఎత్తుగా ఉండడంతో బయటికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో రాకూన్.. చాలా రకాలుగా ప్రయత్నించింది.

Thief In Train: రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..


ఈ క్రమంలో దానికి అక్కడే పడి ఉన్న ఓ పొడవాటి చెక్క పలక కనిపించింది. దాన్ని చూడగానే రాకూన్‌కు ప్రాణం లేచొచ్చింది. వెంటనే ఆ చెక్కను తీసుకుని కంటైనర్‌ గోడకు నిలబెట్టింది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో సారి దాన్ని (raccoon came out of the container with help of wood) పక్కాగా సెట్ చేసి, దానిపై నుంచి ఎక్కేసి పైకి వెళ్లిపోయింది. ఇలా సమయస్ఫూర్తిగా వ్యవహరించి కంటైనర్ నుంచి బయటపడిన రాకూన్ కుక్కన చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే.. ఇతను చేస్తున్న పని చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రాకూన్‌ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2025 | 01:59 PM