Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..
ABN , Publish Date - Jan 25 , 2025 | 10:17 AM
ఇద్దరు వ్యక్తులు గ్యాస్ స్టవ్‌పై టీ తయారు చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంట తక్కువగా వస్తుండడంతో టీ తయారు కావడం అలస్యమైంది. దీంతో వారిలో ఓ వ్యక్తికి విచిత్రమైన ఐడియా వచ్చింది. చివరకు అతను చేసిన నిర్వాకం ఏంటో మీరే చూడండి..

కొందరు చేసే వింత వింత విన్యాసాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు చేసే పిచ్చి పిచ్చి ప్రయోగాలు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే పనులు చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలన్నీ కలిసి చివరకు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గ్యాస్ తక్కువగా వస్తుండడంతో సదరు వ్యక్తి మంట ఎక్కువ వచ్చేందుకు వింత ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గ్యాస్ స్టవ్‌పై టీ తయారు చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంట తక్కువగా వస్తుండడంతో టీ తయారు కావడం అలస్యమైంది. దీంతో వారిలో ఓ వ్యక్తికి విచిత్రమైన ఐడియా వచ్చింది.
వెంటనే తన పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొచ్చి, గ్యాస్ మంటపై స్ప్రే చేశాడు. దీంతో అప్పటిదాకా తక్కువగా ఉన్న మంట కాస్తా.. పెర్ఫ్యూమ్ స్ప్రే చేయగానే ఒక్కసారిగా పెద్ద మంటగా మారిపోతుంది. ఇలా అతను చాలా సేపు పెర్ఫ్యూమ్‌ను స్ప్రే చేస్తూనే ఉంటాడు. ఇలా తక్కువగా ఉన్న మంటను పెర్ఫ్యూమ్ స్ప్రే (perfume Spray on gas flame) ద్వారా పెద్ద మంటగా మార్చిన ఇతడి అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘ఇలా చేస్తే వంటేమో గానీ ప్రాణాలు పోతాయ్’’.., ‘‘మగవారి కంటే ఆడవాళ్లు ఎక్కువ రోజులు జీవించేది ఇందుకే’’.., ‘‘2 నిమిషాల మంటకు రూ.180 ఖర్చు’’.., ‘‘ఇండియాలో ఇలాంటి వారికి కొదువే ఉండదు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 7.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Thief In Train: రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..