Share News

Python Attack: కొండచిలువను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 07:41 AM

ఓ యువతి ఏకంగా కొండచిలువనే పట్టుకుంది. అంతటితో ఆగకుండా దాంతో కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చింది. అప్పటికీ ఆగకుండా మరో అడుగు ముందుకేసి దాన్ని ముద్దు పెట్టుకోవాలని కూడా చూసింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Python Attack: కొండచిలువను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

కొందరు పాములతో తమాషా చేస్తూ వీడియోలు చేస్తుంటారు. మరికొందరు మద్యం మత్తులో వాటితో ఆడుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. మగవారితో పాటూ కొందరు మహిళలు కూడా పాములతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఏకంగా కొండచిలువనే ముద్దు పెట్టుకోవాలని చూసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఏకంగా కొండచిలువనే పట్టుకుంది. అంతటితో ఆగకుండా (young woman took selfie with python) దాంతో కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చింది. అప్పటికీ ఆగకుండా మరో అడుగు ముందుకేసి దాన్ని ముద్దు పెట్టుకోవాలని కూడా చూసింది. చేత్తో కొండచిలువను గాల్లోకి ఎత్తి పట్టుకుని, మెల్లగా దాని తలను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.

Thief In Train: రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..


అయితే అంతవరకూ కామ్‌గా ఉన్న కొండచిలువకు.. యువతి విచిత్ర నిర్వాకంతో చిర్రెత్తుకొస్తుంది. ‘‘పోనీలే అని సెల్ఫీ ఇస్తే.. ముద్దు పెట్టుకుని మరింత ఇబ్బంది పెడతావా’’.. అన్నట్లుగా ఆమె ముఖంపైకి (python bit the young woman's nose) దూసుకెళ్లి ముక్కును పట్టేసుకుంటుంది. కొండచిలువ ఇలా ఊహించని విధంగా ముక్కు పట్టేసుకోవడంతో ఆమె నొప్పితో కేకలు పెడుతుంది. ఆ వెంటనే దాన్ని గట్టిగా పక్కకు లాగి కిందపడేసి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాత కొండచిలువ కాటు కారణంగా తన ముక్కుపై ఏర్పడ్డ గాయాలను చూపిస్తూ మరో వీడియో కూడా చేసింది.

Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..


ఇలా కొండచిలువను ముద్దు పెట్టుకోవాలని చూసి చివరకు దాని కాటుకు గురైన యువతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొండచిలువతో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘పాములు, కొండచిలువలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లు, 52. 6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే.. ఇతను చేస్తున్న పని చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2025 | 07:41 AM