Thief In Train: రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:25 PM
ఓ రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ నుంచి లోపలికి చేతులు పెట్టి వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే..

రైలు ప్రయాణ సమయాల్లో ఎంత మంచి అనుభూతి కలుగుతుందో.. అప్రమత్తంగా లేకపోతే అంతే స్థాయిలో షాక్ కూడా తగులుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊహించని ప్రమాదాల బారిన పడే వారిని చూస్తుంటాం. అలాగే అదే నిర్లక్ష్యంగా ఉంటూ విలువైన వస్తువులను పోగొట్టుకునే వారిని కూడా చూస్తుంటాం. ప్రధానంగా కిటికీ పక్కన కూర్చున్న వారి వస్తువులను దొంగలు లాక్కెళ్లిపోవడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ కాన్ఫూర్ రైల్వే స్టేషన్‌లో (Kanpur Railway Station) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ నుంచి లోపలికి చేతులు పెట్టి వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దొంగ చేతులను పట్టుకుంటారు.
Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..
అప్పటికే రైలు కదలడంతో దొంగ అలాగే (thief hanging from the train window) కిటికీకి వేలాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత ప్రయాణికులు మానవత్వంతో ఆలోచించి.. అతడు కిందపడకుండా చేతులు పట్టుకుంటారు. ఇంత జరుగుతున్నా ఆ దొంగ ముఖంలో కొంచెం కూడా భయం కనిపించదు. రైల్లోని సీటు పట్టుకుని ఆడుకుంటూ కనిపిస్తాడు. దీంతో ప్రయాణికులంతా అతన్ని వింతగా చూస్తారు. ఇలా ఆ దొంగ చాలా దూరం వరకూ అలాగే వేలాడుతూ వెళ్లినట్లు తెలిసింది.
Viral Video: షార్ట్‌కట్‌లో నరకానికి వెళ్లడమంటే ఇదే.. ఇతను చేస్తున్న పని చూస్తే నోరెళ్లబెడతారు..
చివరకు కొందరు ప్రయాణికులు చైన్ లాగి, దొంగను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ప్రయాణికులు మానవత్వం ప్రదర్శించడం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger And Lion Video: సింహంతో పులి భీకర ఫైట్.. చివరకు జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..