Viral Video: వీడెవడండీ బాబూ.. వేదికపైనే వధువును ముద్దు అడిగేయడంతో.. చివరకు..
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:56 PM
పెళ్లిళ్లలో సినిమా తరహా సంఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు ప్లాన్ చేసి మరీ వినూత్నంగా స్ర్కిప్ట్‌లు రెడీ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. మరికొందరు సినిమా సీన్లకు మించిన యాక్టింగ్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
పెళ్లిళ్లలో సినిమా తరహా సంఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు ప్లాన్ చేసి మరీ వినూత్నంగా స్ర్కిప్ట్‌లు రెడీ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. మరికొందరు సినిమా సీన్లకు మించిన యాక్టింగ్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులు దండలు మార్చుకునే సమయంలో ఉన్నట్టుండి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అందరి ముందే వరుడు వధువును ముద్దు అడగేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో దండలు మార్చుకుంటుంటారు. వధూవరులు ఇద్దరూ చేతిలో దండలు పట్టుకుని ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేయాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
వధువు దండ వేసే సమయంలో వరుడు సడన్‌గా వెనక్కు వెళ్తాడు. ‘‘నాకు ముద్దు పెడితేనే దండ వేయించుకుంటా’’.. అంటూ తన బుగ్గపై చేయి పెట్టుకుని వధువుకు సైగ చేస్తాడు. దీంతో వధువు తెగ సిగ్గుపడిపోతుంది. దండ వేయాలని ఎంత సేపు ప్రయత్నించినా వరుడు మాత్రం అందుకు ఒప్పుకోకుండా ముద్దు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తాడు. వధువు సమీపానికి వెళ్లి చెంప చూపించి ముద్దు పెట్టమని కోరతాడు. దీంతో చేసేదేమీ లేక వధువు చివరకు వరుడి (bride kissing the groom) చెంపపై ముద్దు పెడుతుంది. తన పంతం నెగ్గడంతో వరుడు మోకాళ్లపై నిలబడి వధువుతో దండ వేయించుకుంటాడు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ వధూవరులను ఎంకరేజ్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడు మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఈ జంట చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2300కి పైగా లైక్‌లు, 2.82 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..