Viral Video: దండ వేయడంలో వధువుకు సాయం చేశాడు.. చివరకు ఆమె రియాక్షన్‌తో నోరెళ్లబెట్టాడు..
ABN , Publish Date - Jan 03 , 2025 | 07:25 PM
ప్రస్తుతం వివాహం అంటేనే వింతలు, వినోదాలకు నిలయంగా మారిన పరిస్థితి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో తమ కళ్ల ముందు కనిపించే అనేక సంఘటనలను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ తద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి..
ప్రస్తుతం వివాహం అంటేనే వింతలు, వినోదాలకు నిలయంగా మారిన పరిస్థితి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో తమ కళ్ల ముందు కనిపించే అనేక సంఘటనలను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ తద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడి మెడలో దండ వేసేందుకు ఓ వధువు ఇబ్బంది పడడం చూసి వెనుకున్ వ్యక్తి ఆమెకు సాయ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధువు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. అయితే దండ మార్చే సమయంలో వరుడిని అతడి వెనుక ఉన్న వ్యక్తి పైకి ఎత్తి పట్టుకుంటాడు. దీంతో వధువు దండ వేసేందుకు ఇబ్బంది పడుతుంది. వధువు వెనుక నిలబడ్డ వ్యక్తి ఇది గమనించి ఆమెకు సాయం చేస్తాడు.వధువును కూడా పైకి ఎత్తుకుని పట్టుకుంటాడు. దీంతో ఎట్టకేలకు ఆమె వరుడి మెడలో దండ అయితే వేస్తుంది.
Viral Video: కుర్చీపై సవారీ.. ఇతడి వినూత్న ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
అలాగే వరుడు కూడా వధువు మెడలో దండ వేస్తాడు. అయితే వధువును కిందకు దింపిన మరుక్షణం.. ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. తనను పైకి ఎత్తిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడంతో (bride slapped the man) అవాక్కవుతాడు. వధువు రియాక్షన్‌కు షాకైన ఆ వ్యక్తి.. ఆ తర్వాత ఆ కోపాన్ని తన పక్కన ఉన్న భార్యపై చూపిస్తాడు. తన భార్యను చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి కిందకు దిగి వెళ్లిపోతాడు.
Viral Video: పిల్లల కుర్చీ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం.. పక్కకు తీసి చూడగా గుండె ఆగిపోయే సీన్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సాయం చేసిన వ్యక్తికి షాక్ ఇచ్చిన వధువు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 23 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..