Share News

Viral Video: డాక్టర్ అంటే ఎవరు..? అన్న ప్రశ్నకు.. ఈ విద్యార్థి రాసిన సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:41 PM

టీచర్, విద్యార్థుల మధ్య కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులు వింత వింత సమాధానాలు చెబుతుంటారు. కొన్నిసార్లు వారు తెలిసీ తెలియక చెప్పే సమాధానాలు చూస్తే అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు విద్యార్థులు ఎంతో లాజిక్ చెప్పే సమాధానాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: డాక్టర్ అంటే ఎవరు..? అన్న ప్రశ్నకు.. ఈ విద్యార్థి రాసిన సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..
Student Innovative Answer to Teacher Question

టీచర్, విద్యార్థుల మధ్య కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులు వింత వింత సమాధానాలు చెబుతుంటారు. కొన్నిసార్లు వారు తెలిసీ తెలియక చెప్పే సమాధానాలు చూస్తే అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు విద్యార్థులు ఎంతో లాజిక్ చెప్పే సమాధానాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. డాక్టర్ అంటే ఎవరు..? అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి రాసిన సమాధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ టీచర్ తమ విద్యార్థులకు పరీక్ష పెట్టాడు. అయితే ఆ ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానికి టీచర్ కూడా అవాక్కయ్యాడు. డాక్టర్ అంటే ఎవరు..? (Who is doctor?) అనేది ఆ ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు ఓ విద్యార్థి అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా, ఇంకాస్త ఫన్నీగా.. మొత్తంగా ఎంతో లాజిక్‌గా సమాధానం రాశాడు.

Viral Video: న్యూఇయర్ వేడుకలను ఇలా చేసుకోవడం ఏంట్రా బాబోయ్.. కారుతో సహా భూమిలో పాతి పెట్టడంతో..


‘‘టాబ్లెట్స్‌‌తో మన రోగాలను చంపి.. తర్వాత బిల్లుతో మనల్ని పంచేవాడే డాక్టర్ అంటే’’.. అంటూ సమాధానం రాసుకొచ్చాడు. విద్యార్థి రాసిన ఈ వింత సమాధానం చూసి టీచర్ అవాక్కయ్యాడు. అతడి సమాధానంలో కూడా లాజిక్ ఉండడంతో 5 మార్కులు వేసి, స్మైలీ ఫేస్ పెట్టడంతో పాటూ వెరీ గుడ్ స్టూడెంట్ అని రాశాడు. కాగా, ఈ ప్రశ్న, సమాధానికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. నీటిపై ఏం చేశాయో మీరే చూడండి..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ విద్యార్థి వెరీ ఇంటెలిజెంట్‌లా ఉన్నాడే’’.., ‘‘ఈ విద్యార్థి ఫ్యూచర్ డాక్టర్‌లా ఉన్నాడే’’.., ‘‘ప్రశ్న, సమాధానాలు బాగున్నాయి కానీ.. ఈ రెండు రాసింది ఒకరే అనిపిస్తోంది’’.., ‘‘ఇది కదా ఫర్‌ఫెక్ట్ సమాధానం అంటే’’.., ‘‘ప్రస్తుతం డాక్టర్లంతా ఇలాగే తయారయ్యారు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 9.4 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2025 | 09:41 PM