Share News

Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:34 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది క్రియేటివ్‌గా ఆలోచిస్తూ అనేక రకాల వీడియోలు చేస్తున్నారు. వీటిలో కొన్ని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వెరసి ఇటు నెటిజన్లకు వినోదాన్ని పంచుతూ అటూ క్రియేటర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి వినూత్నమైన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Astronaut on the Moon Funny Videos

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది క్రియేటివ్‌గా ఆలోచిస్తూ అనేక రకాల వీడియోలు చేస్తున్నారు. వీటిలో కొన్ని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వెరసి ఇటు నెటిజన్లకు వినోదాన్ని పంచుతూ అటూ క్రియేటర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి వినూత్నమైన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అంతా అతన్ని ఆశ్చర్యంగా గమనిస్తుండగా.. అంతలోనే తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యోమగామి చంద్రుడిపై (Astronaut on the moon) అడుగుపెట్టాడు. చంద్రుడిపై అడుగుపెట్టడం ఇది కొత్తేమీ కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇందులో లాజిక్ ఏంటో మీకే తెలిసిపోతుంది. చంద్రుడిపై దిగిన ఆ వ్యోమగామి నేలపై నడుస్తూ ఆసక్తిగా గమనిస్తుంటాడు. అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమషా సంఘటన చోటు చేసుకుంది.

Viral Video: సాక్స్‌లు లేవని ఇలా ఎవరైనా చేస్తారా.. ఈమె అతి తెలివికి దండం పెట్టాల్సిందే..


ఆ వ్యోమగామి అలా కాస్త ముందుకు వెళ్లగానే.. ఆ పక్కనే ఓ కారు దూసుకెళ్తూ కనిపిస్తుంది. చంద్రుడిపై కారు వెళ్లడమేంటీ.. అని అనుకునే లోగానే.. అసలు విషయం రివీల్ అయిపోతుంది. అతడు రోడ్డు పక్కన నడుస్తూ.. చంద్రుడిపై ఉన్నట్లు భ్రమ కలిగించేలా వీడియో తీశాడు. నేల మొత్తం చంద్రుడిపై ఉన్నట్లుగానే కనిపించడంతో మొదట అంతా అతను చంద్రుడిపై దిగినట్లుగానే అనుకున్నారు. ఇలా కెమెరామెన్ ఎంతో తెలివిగా చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Viral Video: పిల్లల కుర్చీ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం.. పక్కకు తీసి చూడగా గుండె ఆగిపోయే సీన్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యోమగామి చంద్రుడిపైకి కారును కూడా తీసుకెళ్లాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో రోడ్ల పరిస్థితి ఇలా ఉందన్నమాట’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 89 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుర్చీపై సవారీ.. ఇతడి వినూత్న ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2025 | 06:34 PM