Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:02 PM
మనుషుల్లో కనబడని మానవత్వాన్ని జంతువులు, పక్షుల్లో చూస్తుంటాం. ఒక కాకి చనిపోతే వేల కాకులు చుట్టూ చేరి సంతాపాన్ని తెలియజేయడం చూస్తుంటాం. అలాగే ఒక కోతి చనిపోతే వందల కోతులు చుట్టూ చేరి తమ బాధను వ్యక్తం చేస్తుంటాయి. ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..
మనుషుల్లో కనబడని మానవత్వాన్ని జంతువులు, పక్షుల్లో చూస్తుంటాం. ఒక కాకి చనిపోతే వేల కాకులు చుట్టూ చేరి సంతాపాన్ని తెలియజేయడం చూస్తుంటాం. అలాగే ఒక కోతి చనిపోతే వందల కోతులు చుట్టూ చేరి తమ బాధను వ్యక్తం చేస్తుంటాయి. ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చనిపోయిన పాము పక్కన ఓ కోబ్రా పడగ విప్పి ఉండిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. పాపం.. ఈ కోబ్రా మనుసు ఎంత గొప్పది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మైదాన ప్రాంతంలో జేసీబీతో క్లీనింగ్ పనులు చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. జేసీబీ యంత్రం కింద పడి ఓ పాము చనిపోయింది. స్థానికులు దాన్ని పక్కన పడేశారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన సహచర పాము చనిపోయిందని తెలుసుకున్న ఓ కోబ్రా.. అక్కడికి వచ్చి పాము పక్కనే పడగ విప్పి మరీ చూస్తూ ఉండిపోయింది.
అక్కడ చుట్టూ అంతా ఉన్నా కూడా ఆ కోబ్రా (cobra) అలా చాలా సేపు పడగ విప్పి, చనిపోయిన పామును (dead snake) చూస్తూ ఉండిపోయింది. ‘‘నన్ను వదలి వెళ్లిపోయావా మిత్రమా.. నువ్వు లేకుండా నేనెలా జీవించాలి’’.. అన్నట్లుగా దాని వైపే చూస్తూ ఉండిపోయింది. ఈ కోబ్రాను చూసి చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఒక పాము చనిపోతే మరో పాము దగ్గరికి వచ్చి ఇలా గమనిస్తూ ఉండిపోవడం కొత్తగా అనిపించడంతో అంతా ఆసక్తిగా గమనించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: దండ వేయడంలో వధువుకు సాయం చేశాడు.. చివరకు ఆమె రియాక్షన్‌తో నోరెళ్లబెట్టాడు..
ఇవి కూడా చదవండి..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..