Share News

Viral Video: ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. నీటిపై ఏం చేశాయో మీరే చూడండి..

ABN , Publish Date - Jan 03 , 2025 | 08:04 PM

క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన.. ఇలా అనేక అంశాల్లో మనుషులకు ఆదర్శంగా నిలుస్తుంటాయి చీమలు. ఆహార సేకరణలో చీమలు కలిసికట్టుగా చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. నీటిపై ఏం చేశాయో మీరే చూడండి..
Ants Building Bridge on Water

క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన.. ఇలా అనేక అంశాల్లో మనుషులకు ఆదర్శంగా నిలుస్తుంటాయి చీమలు. ఆహార సేకరణలో చీమలు కలిసికట్టుగా చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చీమలన్నీ కలిసి నీటిపై కట్టిన వంతెనను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా చీమలు నీటి ప్రవాహం ఉన్న ప్రదేశంలో ఆహార సేకరణకు వెళ్తాయి. అయితే ఈ క్రమంలో అవి నీళ్లు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా అడుగు ముందుకు వేస్తాయి. చివరకు చీమలన్నీ కలిసి ఏకంగా నీటిపైనే వంతెన నిర్మించేస్తాయి. ఇలా నీటిపై చాలా దూరం వరకూ వంతెన నిర్మించి, అవతలి వైపునకు చేరకుంటాయి.

Viral Video: దండ వేయడంలో వధువుకు సాయం చేశాడు.. చివరకు ఆమె రియాక్షన్‌తో నోరెళ్లబెట్టాడు..


నీటి ప్రవాహం ఉన్నా కూడా ఆ వెంతన మాత్రం (Ants built a bridge over water) చెక్కుచెదరకుండా ఉంటుంది. చీమలన్నీ ఆ వంతెనపై ఒకదాని వెనుక వెళ్తూ ఆహారాన్ని సేకరిస్తున్నాయి. తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదనే మాటను ఆచరణలో చేసి చూపించిన ఈ చీమలను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: పిల్లల కుర్చీ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం.. పక్కకు తీసి చూడగా గుండె ఆగిపోయే సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చీమల పనితనం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చీమలను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చంద్రుడిపైకి చేరుకున్న వ్యోమగామి.. చివర్లో షాకింగ్ సీన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2025 | 08:04 PM