Share News

Viral Video: ప్రాణాలకు తెగించింది.. పక్షిలా మారింది... ఈ కోడి విన్యాసం చూశారంటే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:53 PM

కొన్నిసార్లు ప్రాణ భయం కంటే ప్రాణాలకు తెగిస్తేనే విజయం సొంతమవుతుంది. ఈ సూత్రం మనుషులకే కాకుండా పక్షులు, జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

Viral Video: ప్రాణాలకు తెగించింది.. పక్షిలా మారింది... ఈ కోడి విన్యాసం చూశారంటే..

కొన్నిసార్లు ప్రాణ భయం కంటే ప్రాణాలకు తెగిస్తేనే విజయం సొంతమవుతుంది. ఈ సూత్రం మనుషులకే కాకుండా పక్షులు, జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ కోడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెద్ద బిల్డింగ్‌ పైకి ఎక్కిన కోడి.. చివరికి ప్రాణాలు తెగించింది. ఈ వీడియోను చూసిన వారంతా ‘‘ప్రాణాలకు తెగించింది.. పక్షిలా మారింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోడి ఎత్తైన బిల్డింగ్‌ పైకి ఎక్కింది. అయితే కిందకు వచ్చే మార్గం లేక అటూ, ఇటూ తిరుగుతోంది. ఈ క్రమంలో అక్కడున్న వారు పట్టుకోవాలని చూడగా బిల్డింగ్ పైకి చేరుకుంది. బిల్డింగ్ చివరకు వెళ్లిన కోడి.. ముందుకు, వెనక్కు వెళ్లలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు కిందకు దూకితే ప్రాణాలు పోయే పరిస్థితి. మరో బిల్డింగ్ పైకి ఎగిరిపోదామంటే చాలా దూరంగా ఉండడంతో ఆలోచించాల్సిన పరిస్థితి.

Viral Video: బాప్‌రే.. ఇదేం ఎటాక్‌రా బాబోయ్.. ఈ జాగ్వార్ వేట చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ పరిస్థితుల్లో కోడి తన ప్రాణాలకు తెగించింది. ఎవరికో ఒకరికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉన్న బిల్డింగ్ పైకి దూకేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా అంతెత్తు బిల్డింగ్ నుంచి రోడ్డుక అవతల చాలా దూరంలో ఉన్న అతి పెద్ద బిల్డింగ్‌పైకి చేరుకునేందుకు ప్రయత్నించింది. బిల్డింగ్ పైనుంచి దూకేసిన కోడి.. గాల్లో దూసుకెళ్తూ దూసుకెళ్తూ చివరకు (chicken jumped from one building to another) ఆశ్చర్యకరంగా పక్షి తరహాలో అవతలి వైపు బిల్డింగ్‌ పైకి చేరుకుంది.

Viral Video: చెప్పింది ఒకటైతే.. చేసింది ఇంకోటి.. పెగ్గు పడితే ఇంతేనేమో..


సాధారణంగా కొంత దూరం వరకే ఎగరగలిగే కోడి.. ఇలా పక్షిలా చాలా దూరం వరకూ గాల్లో దూసుకెళ్తడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోడి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలకు తెగించి అనుకున్నది సాధించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.46 లక్షలకు పైగా లైక్‌లు, 18.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 01:53 PM