Share News

Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:13 AM

కొందరు తమ ఇళ్లలో చిత్రవిచిత్రమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ఇళ్లను విచిత్రమైన ఆకారాల్లో నిర్మించేవారు కొందరైతే.. మరికొందరు అందులో ఎవరూ చేయని విధంగా వినూత్న సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. అందులోనూ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇళ్లను డిజైన్ చేసుకుంటున్నారు. ఇలాంటి..

Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Western Toilet Facilities in Indian Toilet

కొందరు తమ ఇళ్లలో చిత్రవిచిత్రమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ఇళ్లను విచిత్రమైన ఆకారాల్లో నిర్మించేవారు కొందరైతే.. మరికొందరు అందులో ఎవరూ చేయని విధంగా వినూత్న సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. అందులోనూ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇళ్లను డిజైన్ చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి ఇండియన్ టాయిలెట్‌లో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బాత్రూంలలో కొందరు వెస్ట్రన్ టాయిలెట్‌లను (Western toilet) ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొందరు ఇండియన్ టాయిలెట్‌లు (Indian toilet) సెట్ చేసుకుంటుంటారు. అయితే ఓ వ్యక్తి తన బాత్రూంలో ఇండియన్ టాయిలెట్‌ను నిర్మించుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. నిర్మించింది ఇండియన్ టాయిలెటే అయినా.. అందులో అతడు చేసిన వెస్ట్రన్ ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: రాజసానికి నిలువెత్తు నిదర్శనమంటే ఇదే.. ఒక్కసారి ఈ పులిని చూశారంటే...


టాయిలెట్ కమోడ్‌కు ముందు ఓ ఇనుప రాడ్ ఏర్పాటు చేసి, దానిపై బైక్ హ్యాండిల్‌ని (Bike handle) అమర్చాడు. వెస్ట్రన్ టాయిలెట్‌లో ఫ్లష్ చేయడం ద్వారా ఏవిధంగా నీళ్లు బయటికి వస్తాయో.. అచ్చం అలాగే ఇక్కడ కూడా బైకు హ్యాండిల్‌ను రైజ్ చేయడం ద్వారా ఇండియన్ టాయిలెట్‌లోనూ నీళ్లు వచ్చేలా సెట్ చేశాడు. ఈ ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇలా ఇండియన్ టాయిలెట్‌లో వెస్ట్రన్ ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టెక్నాలజీని ఈ విధంగా కూడా వాడుకోవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఇండియన్ టాయిలెట్‌లో వెస్ట్రన్ ఏర్పాట్లు.. సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లు, 2.49 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో.. బాత్రూం ఎదురుగా ఏర్పాట్లు ఎలా చేశారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 11:13 AM