Share News

Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:15 AM

పాములతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది. కాదూ కూడదు వాటితో ఆడుకుందామని చూస్తే.. చివరికి వాటి కాటుకు బలవ్వాల్సిందే. ఎంతో మంది పాములతో చెలగాటమాడాలని చూసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు.. కొందరైతే ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను చూశాం. ఇలాంటి ..

Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
man who kissed snake

పాములతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది. కాదూ కూడదు వాటితో ఆడుకుందామని చూస్తే.. చివరికి వాటి కాటుకు బలవ్వాల్సిందే. ఎంతో మంది పాములతో చెలగాటమాడాలని చూసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు.. కొందరైతే ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కోబ్రాను పట్టుకోవడమే కాకుండా ఏకంగా దానికి ముద్దు కూడా పెట్టేశాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు కుర్చీలో కూర్చుని పామును పట్టుకుని కెమెరాకు చూపిస్తూ అవగాహన కల్పిస్తుంటాడు. చేతిలో పట్టుకోవడమే డేంజర్ అనుకుంటే.. ఇతనేమో అంతటితో ఆగకుండా పామును తన మూతి వద్దకు తెచ్చుకుని తల కింది భాగంలో (man kissed the snake) ముద్దు కూడా పెట్టేస్తాడు. అయితే పాముకు ఇలా ముద్దు పెట్టాడో లేదో.. వెంటనే ఆ పాము (snake bit young man) అతడి నుదిటిపై కాటేస్తుంది.

Viral Video: వయసు చూస్తే 84.. విన్యాసాలు చూస్తే యువతకే సవాల్.. బామ్మా నీకు హ్యాట్సాప్..


పాము కాటేయడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనలో అతను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ యువకుడు పాముతో అనేక రకాల వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటాడు. పాముతో చెలగాటమాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని గతంలో చాలా చూశాం. కొందరు ఫుల్‌గా మద్యం సేవించి, పాములను మెడలో వేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇంకొందరైతే పాములను ఏకంగా నోట్లో కూడా పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం చూశాం. ఇలాంటి విన్యాసాలు ప్రమాదకరమని తెలిసినా చాలా మంది ఈ తప్పులు చేస్తూనే ఉన్నారు.

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..


తాజాగా పాముకు ముద్దు పెట్టిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముతో పరాచకాలు ఆడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రమాదమని తెలిసి కూడా తప్పు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో.. బాత్రూం ఎదురుగా ఏర్పాట్లు ఎలా చేశారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 09:15 AM