Viral Video: బాప్‌రే.. ఇదేం ఎటాక్‌రా బాబోయ్.. ఈ జాగ్వార్ వేట చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:08 PM
పులి పేరు వింటేనే ఇంట్లో వణుకుపుడుతుంది. ఇక దాని వేట చూస్తే గుండె ఆగిపోయేంత పనవుతుంటుంది. ఎలాంటి జంతువునైనా ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటాయి. కొన్ని జంతువులు పులుల నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. అయితే పులులు మాత్రం వాటిని ఒక్కసారిగా పట్టుకున్నాయంటే.. ఇక వదిలే ప్రసక్తే ఉండదు. ఎలాంటి ..
పులి పేరు వింటేనే ఇంట్లో వణుకుపుడుతుంది. ఇక దాని వేట చూస్తే గుండె ఆగిపోయేంత పనవుతుంటుంది. ఎలాంటి జంతువునైనా ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటాయి. కొన్ని జంతువులు పులుల నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. అయితే పులులు మాత్రం వాటిని ఒక్కసారిగా పట్టుకున్నాయంటే.. ఇక వదిలే ప్రసక్తే ఉండదు. ఎలాంటి జంతువునా వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంటుంది. పులి, చిరుత, జాగ్వార్ తదితర క్రూర జంతువుల వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ జాగ్వార్ వేట వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మొసలిపై జాగ్వార్ చేసిన దాడి చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ జాగ్వార్.. వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి ఓ నదిలో మొసలి కనిపిస్తుంది. మొసలిని చూడగానే ‘‘ఎలాగైనా ఈ పూటకు మొసలితో సరిపెట్టుకోవాల్సిందే’’.. అని బలంగా నిర్ణయించుకుని బరిలోకి దిగింది. నీటిలో ఉన్న మొసలిపై దాడి చేయడం ప్రమాదకరమని తెలిసినా అడుగు ముందుకు వేస్తుంది.
Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
నీటిలోకి దూకేసిన జాగ్వార్.. చూస్తుండగానే (Jaguar attack on crocodile) మొసలి పీక పట్టుకుని ఒడ్డుకు లాక్కొస్తుంది. జాగ్వార్ నుంచి తప్పించుకోవాలని మొసలి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. మొసలి మెడను గట్టిగా పట్టుకున్న జాగ్వార్.. దాన్ని విదిలించి, విదిలించి మరీ ప్రాణాలు తీసేస్తుంది. ఇలా చూస్తుండగానే అంత పెద్ద మొసలిని ఎంతో అవలీలగా చంపేసింది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది.
Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ జాగ్వార్ వేట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మొసలికి చుక్కుల చూపించిన జాగ్వార్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2600కి పైగా లైక్‌లు, 4.37 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చెప్పింది ఒకటైతే.. చేసింది ఇంకోటి.. పెగ్గు పడితే ఇంతేనేమో..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..