Share News

Viral Video: చెప్పింది ఒకటైతే.. చేసింది ఇంకోటి.. పెగ్గు పడితే ఇంతేనేమో..

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:05 PM

కొందరు పెగ్గు మందు పడితే చాలు.. ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. మరికొందరైతే ముందు కొడితే ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. మురుగు నీటిలో స్నానం చేస్తూ కొందరు, జంతువులతో పోటీపడుతూ ఇంకొందరు, విచిత్ర విన్యాసాలు చేస్తూ మరికొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: చెప్పింది ఒకటైతే.. చేసింది ఇంకోటి.. పెగ్గు పడితే ఇంతేనేమో..
drunk man builds platform under hand pump

కొందరు పెగ్గు మందు పడితే చాలు.. ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతుంటారు. మరికొందరైతే ముందు కొడితే ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. మురుగు నీటిలో స్నానం చేస్తూ కొందరు, జంతువులతో పోటీపడుతూ ఇంకొందరు, విచిత్ర విన్యాసాలు చేస్తూ మరికొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మందు కొట్టిన ఓ వ్యక్తి చేతి పంపు వద్ద ప్లాట్‌ఫామ్ పనులు చేస్తు్న్నాడు. అయితే అతను పని చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పెగ్గు పడితే ఇంతేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి చేతి పంపు (Hand pump) కింద నీళ్లు పట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్ (Platform) నిర్మించాలని చెప్పారు. అందుకు అంగీకరించిన ఓ వ్యక్తి పనిలోకి దిగాడు. అన్నట్లుగానే గంటల వ్యవధిలో చేతి పంపు వద్ద చక్కని ప్లాట్‌ఫామ్ కూడా నిర్మించాడు. అంతా బాగానే ఉంది కదా.. ఇందులో నవ్వడానికి ఏముందీ... అని మీకు సందేహం రావొచ్చు. అతడు ప్లాట్‌ఫామ్ నిర్మించిన ప్రదేశం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


సాధారణంగా ఎవరైనా చేతి పంపు నుంచి నీళ్లు కిందపడే ప్రదేశంలో ప్లాట్‌ఫామ్ నిర్మిస్తారు. అయితే మందు కొట్టిన ఈ వ్యక్తి (drunk man ).. చేతిపంపు కింద కాకుండా కాస్త దూరంగా రోడ్డుపై నిర్మించేశాడు. చేతిపంపు కింద చూడగా గుంతల పడి, నీళ్లు నిల్వ చేరి అలాగే అధ్వానంగా ఉంది. దీంతో షాకైన ఓ వ్యక్తి అతడి వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. చేతిపంపు కింద ప్లాట్‌ఫామ్ నిర్మించమని చెబితే.. రోడ్డుపై నిర్మించావేంటీ అని అడిగాడు. అందుకు అతను.. ‘‘చేతి పంపు కింద నీళ్లు నిలిచి అధ్వానంగా ఉంది.. అక్కడ నిర్మిస్తే ప్లాట్‌ఫామ్ దెబ్బతింటుంది.. అందుకే ఇలా రోడ్డుపై నిర్మించేశా’’.. అని సమాధానం చెబుతాడు.

Viral Video: రాజసానికి నిలువెత్తు నిదర్శనమంటే ఇదే.. ఒక్కసారి ఈ పులిని చూశారంటే...


మందుబాబు ఇచ్చిన సమాధానానికి సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబా మజాకా.. సరైన ప్రదేశంలో ప్లాట్‌ఫామ్ నిర్మించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘లోకల్ బ్రాండ్ తాగితే ఇలాగే అవుతుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 82 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 12:05 PM