Share News

Viral Video: ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదబ్బా.. పిల్లాడికి ఈమె ఎలా కటింగ్ చేస్తుందో చూస్తే..

ABN , Publish Date - Jan 04 , 2025 | 08:59 PM

చిన్న పిల్లలను ఉదయం స్నానం చేయించడం దగ్గర నుంచి స్కూల్‌కు పంపే వరకూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు చేసే అల్లరిని ఆపడం అసాధ్యమనే చెప్పాలి. స్నానం చేయడానికీ, స్కూల్‌కు వెళ్లేందుకు మొండికేస్తుంటారు. ఎంత బుజ్జగించినా వారు మాత్రం తగ్గేదే లేదు.. అన్నట్లుగా..

Viral Video: ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదబ్బా.. పిల్లాడికి ఈమె ఎలా కటింగ్ చేస్తుందో చూస్తే..
Mother Innovatively Cutting Child

చిన్న పిల్లలను ఉదయం స్నానం చేయించడం దగ్గర నుంచి స్కూల్‌కు పంపే వరకూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు చేసే అల్లరిని ఆపడం అసాధ్యమనే చెప్పాలి. స్నానం చేయడానికీ, స్కూల్‌కు వెళ్లేందుకు మొండికేస్తుంటారు. ఎంత బుజ్జగించినా వారు మాత్రం తగ్గేదే లేదు.. అన్నట్లుగా పంతం పడుతుంటారు. ఇక కటింగ్ చేయించే సమయంలోనూ పిల్లలు ఏడుస్తూ, అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది పెడుతుంటారు. దీంతో ఇలాంటి సమయాల్లో క్షురకులు ఎంతో సహనంతో కటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుదితంగా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ తల్లి తన కొడుక్కు కటింగ్ చేసేందుకు వింత ట్రిక్ వాడింది. ఈమె కటింగ్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తల్లి (mother) తన కొడుక్కు (child) కటింగ్ చేయించాలని అనుకుంది. అయితే సెలూన్ షాపులో కటింగ్ చేయడం సాధ్యం అనుకుందో ఏమో గానీ.. ఇంటి వద్దే సింపుల్‌గా కటింగ్ (Hair cutting) చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ విచిత్రమైన ట్రిక్ ప్రయోగించింది.

Viral Video: ఆకలితో ఉన్న పులి.. ఎదురుగా వచ్చిన పంది.. చివరికి జరిగింది చూస్తే.. గూస్ బమ్స్ ఖాయం..


ఇంట్లో మూలన ఉన్న పెద్ద అట్ట పెట్టెను తీసుకొచ్చి, బాలుడిని అందులో కూర్చోబెట్టి తల మాత్రం బయటికి బయటికి పెట్టింది. కింద వైపు రెండు రంధ్రాలు చేసి, పిల్లాడి కాళ్లను అందులోంచి బయటికి పెట్టింది. చేతులు బాక్సులోనే ఉండడంతో కదిలేందుకు అవకాశం లేకుండా పోయింది. తర్వాత బాలుడి తలపై ఓ బౌల్‌ను బోర్లించి, ట్రిమ్మర్‌తో చకచకా కటింగ్ చేసేసింది. ఇలా పిల్లాడికి సులభంగా కటింగ్ చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video: మానవత్వం మంటగలిసిన వేళ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను.. కాపాడాల్సింది పోయి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లాడికి ఇలాక్కూడా కటింగ్ చేయవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో చాలా బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 59 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2025 | 08:59 PM