Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో.. బాత్రూం ఎదురుగా ఏర్పాట్లు ఎలా చేశారంటే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 09:49 PM
తెలివిగా చేస్తూ కొందరు, అతి తెలివిగా వ్యవహరిస్తూ మరికొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. వీరిని చూసి ఇంకొందరు ఏవోవే చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ నెటిజన్ల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తుంటాం. తాజాగా..
తెలివిగా చేస్తూ కొందరు, అతి తెలివిగా వ్యవహరిస్తూ మరికొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. వీరిని చూసి ఇంకొందరు ఏవోవే చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ నెటిజన్ల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బాత్రూం ఎదురుగా చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బాత్రూం (bathroom) ఎదురుగా విచిత్రమైన ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా బాత్రూంకు వెళ్లే సమయంలో డోర్ కొడుతుంటారు. ఎవరూ లేకపోతే డోర్ తీసుకుని లోపలికి వెళ్లిపోతుంటారు. కానీ ఈ శ్రమ కూడా లేకుండా ఓ వ్యక్తి తన బాత్రూం ఎదురుగా (Indicator boards) ఓ బోర్డు పెట్టేశాడు. అది కూడా ఓ కర్రకు రెండు బోర్డులు పెట్టాడు.
Viral Video: ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదబ్బా.. పిల్లాడికి ఈమె ఎలా కటింగ్ చేస్తుందో చూస్తే..
అక్కడ ఉన్న ఓ బోర్డులో లోపల వ్యక్తి ఉన్నారు అని రాసి ఉంది. మరో బోర్డుపై లోపల ఎవరూ లేరు అని రాసి ఉంది. బాత్రూంలోకి వెళ్లే సమయంలో బోర్డును గేటు తరహాలో తీసుకుని వెళ్లాలి. ఆ సమయంలో లోపల వ్యక్తి ఉన్నట్లు తెలిపే బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అదే తరహాలో బయటికి వెళ్లిపోయాక చూస్తే.. లోపల ఎవరూ లేరు అనే బోర్డు కనిపించేలా సెట్ చేశాడన్నమాట. ఇతడి అతి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: ఆకలితో ఉన్న పులి.. ఎదురుగా వచ్చిన పంది.. చివరికి జరిగింది చూస్తే.. గూస్ బమ్స్ ఖాయం..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘బాత్రూంను ఇంత పర్‌ఫెక్ట్‌గా వాడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 1.95 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..