Share News

Viral Video: అలసిపోయి చెట్టు కింద కూర్చున్న సింహం.. అంతలోనే పైనుంచి పడిపోయిన జింక.. చివరకు..

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:47 PM

బాగా అలసిపోయిన ఓ సింహం ఎండ వేడికి తాళలేక చివరకు ఓ చెట్టు కిందకు వెళ్తుంది. చెట్టు నీడలో సేదతీరుతుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి జింక కళేబరం పైనుంచి కిందపడడంతో చిరవకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: అలసిపోయి చెట్టు కింద కూర్చున్న సింహం.. అంతలోనే పైనుంచి పడిపోయిన జింక.. చివరకు..

సింహాల దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి వేటను టార్గెట్ చేస్తే.. ఇక వాటికి తిరుగు ఉండదు. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అవలీలగా వేటాడేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు సింహాలు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలసిపోయిన ఓ సింహం చివరకు చెట్టు కింద కూర్చుని సేదతీరుతోంది. ఈ సమయంలో ఉన్నట్టుండి పైనుంచి ఓ జింక కలేబరం కిందపడింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కెన్యాలోని (Kenya) మసైమారా ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. బాగా అలసిపోయిన ఓ సింహం ఎండ వేడికి తాళలేక చివరకు ఓ చెట్టు కిందకు వెళ్తుంది. చెట్టు నీడలో సేదతీరుతుండగా (tired lion rests under tree) ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత ఆ చెట్టు పైనుంచి ఓ జింక కలేబరం ధబేల్‌మని కింద పడింది.

Viral Video: స్పీడ్ బోటును వెంబడించిన నీటి ఏనుగు.. చివరికి ఏమైందో చూస్తే..


ఉన్నట్టుండి జింక పడిపోవడంతో సింహం ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెనక్కు తిరిగి జింక పడిపోవడాన్ని చూసి మెల్లిగా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ‘‘ఉన్నట్టుండి ఈ జింక ఎక్కడి నుంచి వచ్చిందబ్బా..’’.. అన్నట్లుగా చెట్టు పైకి అనుమానంగా చూస్తుంది. చుట్టూ ఏదైనా జంతువు ఉందా.. అన్నట్లుగా అంత గమనిస్తుంది. అయినా అక్కడ ఎలాంటి జంతువూ కనిపించదు. అంతకు ముందు ఓ చిరుత ఆ జింకను వేటాడి చెట్టుపైకి తీసుకెళ్లింది.

Viral Video: బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం.. పదో అంతస్థు నుంచి ఎలా వదిలాడో చూడండి..


అయితే తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అసలిపోయిన సింహానికి ఆకలి చచ్చిపోయినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ సింహం విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 14.7 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే ఇదే జరుగుతుంది.. స్లాబ్ వేస్తుండగా ఉన్నట్టుండి..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 12:47 PM