Viral Video: ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే ఇదే జరుగుతుంది.. స్లాబ్ వేస్తుండగా ఉన్నట్టుండి..
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:25 AM
కొందరు కార్మికులు నిర్మాణంలో ఉన్న ఇంటిపై కాంక్రీట్ స్లాబ్ వేస్తుంటారు. నలుగురు కార్మికులు పని చేస్తుండగా.. యంత్రం సాయంతో పైన సిమెంట్ కాంక్రీటును వేస్తుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యంత విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు భారీ మూల్యాన్ని చెల్లిస్తుంటారు. మరికొన్నిసార్లు ఒకరు చేసిన తప్పునకు అంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. నిర్మాణాల సమయంలో ఇళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిన ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కార్మికులు నిర్మాణంలో ఉన్న ఇంటిపై (Workers laying concrete slab) కాంక్రీట్ స్లాబ్ వేస్తుంటారు. నలుగురు కార్మికులు పని చేస్తుండగా.. యంత్రం సాయంతో పైన సిమెంట్ కాంక్రీటును వేస్తుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
అంతవరకూ బాగున్న స్లాబ్ కాస్తా.. అంతలోనే ఒక్కసారిగా ( slab collapsed) కుప్పకూలిపోయింది. దీంతో వారంతా ఒక్కసారిగా భయాందోనలకు గురయ్యారు. ఎక్కడ కిందపడిపోతామో అనే భయంతో అక్కడే ఉన్న ఇనుప కడ్డీలను పట్టుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: గుండెను పిండేసే సీన్.. కుంభమేళాలో ఈ పెద్దాయన చేస్తున్న పని చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల టైం ఎంతో బాగుంది.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 18.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..