Dog Attack On Boy: పిల్లలను బయటికి పంపిస్తున్నారా.. ఈ బాలుడి పరిస్థితి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:18 AM
రోడ్డుపై పాదచారులు అటూ, ఇటూ నడుస్తుంటారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ అటుగా వస్తారు. పెద్ద వారు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అక్కడే సైకిల్ తొక్కుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను బయటికి పంపడం కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒంటరిగా బయట తిరిగే పిల్లలు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.సైకిల్‌పై రోడ్డు మీదకు వచ్చిన ఓ పిల్లాడిపై కుక్క దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై పాదచారులు అటూ, ఇటూ నడుస్తుంటారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ అటుగా వస్తారు. పెద్ద వారు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అక్కడే సైకిల్ తొక్కుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వారిద్దరిలో ఓ బాలుడిని అక్కడే ఉన్న వీధి కుక్క టార్గెట్ చేస్తుంది.
Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఒక్కసారిగా మీదకు ఉరకడంతో ఆ బాలుడు అదుపు తప్పి కిందపడిపోతాడు. మరో పిల్లాడు ఇది చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. బాలుడు కింద పడగానే కుక్క పిల్లాడి చేయి, మెడ వద్ద కట్టిగా కరిచేస్తుంది. చాలా సేపు ఆ పిల్లాడు కుక్క నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అయినా కుక్క అతన్ని వదలకుండా గట్టిగా (Dog attack on boy) పట్టుకుని కరుస్తుంటుంది. ఆ సమయంలో అక్కడ పెద్ద వారు ఎవరూ లేకపోవడంతో విడిపించడానికి ఆస్కారం లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత ఆ పిల్లాడు ఎలాగోలా కుక్క నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..
అయితే ఈ ఘటనలో ఆ బాలుడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లలను ఒంటరిగా బయటికి పంపించవద్దు’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 4.16 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు రద్దు .. రిజర్వేషన్ టికెట్ రిఫండ్ పొందండం ఎలాగంటే..

ఈ ఫొటోలో 78 ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా..?

ప్రాణాలు తీస్తున్న ప్రేమికులు.. కాళ్లపారాని ఆరకముందే ..

బైకు హ్యాండిల్‌కు వేలాడుతున్న బ్యాగు.. దగ్గరికి వెళ్లి చూడగా..
