Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడమంటే ఇదే.. ఎద్దుకు సాయం చేసిన ఈ వ్యక్తి పరిస్థితి.. చివరకు..
ABN , Publish Date - Feb 05 , 2025 | 09:37 PM
ఓ వ్యక్తి నీటి ఒడ్డున సేదతీరుతుండగా.. ఓ ఎద్దు అక్కడే నిలబడి ఉంది. అయితే దాని కొమ్ములకు దారాలు ఇరుక్కుని ఉంటాయి. ఎద్దు ఇబ్బందిని గమనించిన ఆ వ్యక్తి దానికి సాయం చేశాడు. అయితే చివరకు ఏం జరిగిందో చూడండి..

‘‘చేసిన సాయం ఊరికే పోదు.. ఎప్పుడూ దానికి ఫలితం ఉంటుంది’’.. అనేది పెద్దల మాట. మంచి చేస్తే ఏదో ఒక రోజు దాని ఫలితం తప్పకుండా ఉంటుందనేది దాని అర్థం. ఇందులో వాస్తవం ఉన్నా కూడా.. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మంచి చేసిన వారికి మంచి జరగడం అటుంచి.. చెడు ఎదురవుతుంటుంది. కొన్నిసార్లయితే ఏకంగా ప్రాణాలే పోయేంత పరిస్థితి వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్న ఎద్దుకు సాయం చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నీటి ఒడ్డున సేదతీరుతుండగా.. ఓ ఎద్దు అక్కడే నిలబడి ఉంది. అయితే దాని కొమ్ములకు దారాలు ఇరుక్కుని ఉంటాయి. దీంతో ఆ ఎద్దు అటూ, ఇటూ కదిలే అవకాశం లేకుండా పోయింది. ఎద్దు ఇబ్బందిని గమనించిన ఆ వ్యక్తి.. దగ్గరికి వెళ్లి కొమ్ములకు చిక్కుకుపోయిన దారాలను పక్కకు తీశాడు.
దారాలను తీయగానే ఆ ఎద్దు వెనక్కు తిరిగి అతడిపై దాడి చేసేందకు వెళ్తుంది. ముందు ఉలిక్కిపడిన ఆ వ్యక్తి.. సాయం చేశాను కాబట్టి.. ఏమీ అనదులే.. అనుకుని చేయి మీద వేసి ప్రేమగా చూస్తాడు. అయితే ఆ వెంటనే రెచ్చిపోయిన ఎద్దు.. ఆ వ్యక్తి ఒక్కసారిగా (bull attacked man) పైకి ఎత్తి కిందపడేసింది. నీళ్లలో పడిపోయిన ఆ వ్యక్తి.. కుయ్యో మొర్రో అనుకుంటూ పైకి లేచి, అలాగే ఎద్దు వైపు చూస్తూ ఉంటాడు. ‘‘మంచి చేస్తే ఇదేనే ప్రతి ఫలం’’.. అనుకుంటూ దాని వైపే చూస్తుండిపోతాడు.
Viral Video: ఇతడి తెలివి తెల్లారిపోనూ.. వంటలో ఉప్పు తక్కువైందని ఏం చేస్తున్నాడో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎద్దు ఎంత పని చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 62 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..