Share News

Viral Video: ఎలక్ట్రికల్ పనిలో ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సిగరెట్‌ వెలిగించి చివరకు ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Feb 05 , 2025 | 08:51 PM

ఓ యువకుడు ఎలక్ట్రికల్ పని చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొందరు ఎలక్ట్రీషియన్లు కొత్త ఇంట్లో వైరింగ్ చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది..

Viral Video: ఎలక్ట్రికల్ పనిలో ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. సిగరెట్‌ వెలిగించి చివరకు ఏం చేశాడో చూడండి..

కొందరు తాము చేసే పనుల్లోనే ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు కష్టమైన పనులను సైతం తెలివితో చేసేస్తుంటారు. ఇంకొందరు అసాధ్యం అనుకున్న వాటిని కూడా చిన్న చిన్న ట్రిక్స్‌‌తో ఎంతో సింపుల్‌గా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ఎలక్ట్రికల్ పని చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సిగరెట్ వెలిగించి అతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ యువకుడు ఎలక్ట్రికల్ పని (Electrical Work) చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొందరు ఎలక్ట్రీషియన్లు కొత్త ఇంట్లో వైరింగ్ చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో స్టాండ్ వేసుకుని సీలింగ్‌లో వైరింగ్ చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే ఈ క్రమంలో ఓ ఖాళీ పైపును కిందకు లాగి, అందులో నుంచి వైర్లు లాగేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: ఇతడి తెలివి తెల్లారిపోనూ.. వంటలో ఉప్పు తక్కువైందని ఏం చేస్తున్నాడో చూడండి..


అదే సమయంలో ఆ పైపు లోకి వైర్లు పంపేందుకు మేడ పైన మరో ఎలక్ట్రీషియన్ ఎదురు చూస్తుంటాడు. అయితే చాలా పైపులు ఉండడంతో ఎందులో నుంచి వైరు పంపాలో వారికి అర్థం కాదు. దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తి తెలివిగా ఆలోచిస్తాడు. సిగరెట్ వెలిగించిన ఆ వ్యక్తి.. పొగను ( Man Blows Cigarette Smoke into Pipe) బయటికి కాకుండా పైపులోకి ఊదుతాడు. ఆ పొగ మొత్తం ఇంటిపై ఉన్న పైపు గుండా బయటికి వస్తుంది. దాన్ని చూసి ఆ వ్యక్తి ఆ పైపు గుండా వైర్లను పంపించేస్తాడన్నమాట.

Viral Video: విద్యుత్ అవసరమే లేని ఫ్రిడ్జ్‌.. ఇంట్లోనే సులభంగా ఎలా సెట్ చేశారో చూడండి..


ఇలా సిగరెట్ పొగను వైరింగ్ చేసేందుకు వాడుకున్న ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 64 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 08:51 PM