Viral Video: ఏనుగు మొండితనం ఎప్పుడైనా చూశారా.. మావటి వెనుక నిలబడి ఏం చేస్తుందో చూడండి..
ABN , Publish Date - Jan 22 , 2025 | 11:26 AM
శరీరంపై విభూతి, బొట్లతో ఉన్న ఓ పెద్ద ఏనుగును మావటి పరీక్షించడానికి వెళ్తాడు. ఈ సమయంలో అతను ఏనుగు ముందు వైపు నిలబడి కర్ర పట్టుకుని ఉంటాడు. ఏనుగును పట్టించుకోనట్లుగా నటిస్తూ పక్కకూ చూస్తుంటాడు. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఏనుగు.. చివరకు..

ఏనుగులు అంటేనే ప్రశాంతతకు మారుపేరుగా కనిపిస్తుంటాయి. ఎలాంటి సందర్భాలోలైనా ఎంతో నిబ్బరంగా, హుందాగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి ఏనుగులు కొన్నిసార్లు అంతే బీభత్సం కూడా సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు చిన్న పిల్లల తరహాలో తమాషా కూడా చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు మావటి వెనుక నిలబడి చిన్న పిల్లల తరహాలో మొండిగా వ్యవహరించింది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ ఏనుగు మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. శరీరంపై విభూతి, బొట్లతో ఉన్న ఓ పెద్ద ఏనుగును (elephant) మావటి పరీక్షించడానికి వెళ్తాడు. ఈ సమయంలో అతను ఏనుగు ముందు వైపు నిలబడి కర్ర పట్టుకుని ఉంటాడు. ఏనుగును పట్టించుకోనట్లుగా నటిస్తూ పక్కకూ చూస్తుంటాడు. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఏనుగు.. చివరకు తొండంతో అతడిని పిలవాలని చూస్తుంది.
Viral Video: రోడ్డు మధ్యలో పిల్లి.. సడన్‌గా ఎంటరైన కుక్క.. చివరికి గుండెలకు హత్తుకునే సీన్...
అయినా మావటి పట్టించుకోకపోవడంతో చివరకుర అతడి చేతిలోని కర్రను లాక్కుంటుంది. ఆ తర్వాత అతడి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంది. రోజూ చేసినట్లుగానే తన తలపై ప్రేమగా నిమరాలంటూ సైగ చేస్తుంది. ఏనుగు బాధను అర్థం చేసుకున్న మావటి.. చివరకు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని, తలపై చేయి పెట్టి నిమురుతాడు. ఆ సమయంలో అంత పెద్ద ఏనుగు కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు మరీ చిన్నపిల్లాడిలా మారిపోయిందే’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగును చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 62 వేలకు పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..