Viral Video: రోడ్డు మధ్యలో పిల్లి.. సడన్‌గా ఎంటరైన కుక్క.. చివరికి గుండెలకు హత్తుకునే సీన్...
ABN , Publish Date - Jan 22 , 2025 | 11:01 AM
ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్‌గా వాహనాలు రావడంతో మధ్యలో ఆగిపోయింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క చివరికి ఏం చేసిందో చూడండి..

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సాటి మనిషికి సాయం చేసే వారే కానరావడం లేదు. సాయం చేయకపోగా కొందరు ఎదుటి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పైశాసిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి రోడ్డు మధ్యలో ఉండడం చూసి కుక్క అక్కడికి వెళ్లింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్‌గా వాహనాలు (Cat in middle of the road) రావడంతో మధ్యలో ఆగిపోయింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క మెల్లిగా సమీపానికి వెళ్లింది.
Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..
కుక్కను చూసిన పిల్లి.. తనను ఎక్కడ కొరికేస్తుందేమో అని భయపడింది. కానీ కుక్క మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పిల్లిని రక్షించేందుకు సిద్ధమైంది. పిల్లిని ఎలాగైనా రోడ్డు దాటించాలని అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చివరికి పిల్లి మెడ పట్టుకుని ఎంతో (dog helps cat cross the road) జాగ్రత్తగా రోడ్డు అవతలి వైపునకు తీసుకొచ్చింది. ఫుట్‌పాత్‌పైకి తీసుకొచ్చి.. ‘‘రోడ్డు పైకి వెళ్లకుండా.. జాగ్రత్తగా పక్క నుంచి వెళ్లిపో’’ అని జాగ్రత్తలు చెబుతున్నట్లుగా పిల్లిని వదిలేసింది.
Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. అడవిలోకి వెళ్లిన వారిపై ఎలుగుబంటి దాడి.. చూస్తుండగానే..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల కంటే ఈ కుక్క ఎంతో మేలు’’.. అంటూ కొందరు, ‘‘మానవత్వం అంటే ఈ కుక్కను చూసి నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..