Share News

King Cobra Viral Video: అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. ఎలా పట్టుకున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 07:15 AM

కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. ఆ పాము ఒక్కసారి కాటేసిందంటే.. ఇక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అయితే తాజాగా, ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. ’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు..

King Cobra Viral Video: అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. ఎలా పట్టుకున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..

పాము పేరు వినగానే ఎవరికైనా ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా ప్రాణాలు పోయేంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం ప్రమాదకరమైన పాములతో సైతం ఆటలాడుకుంటుంటారు. మరికొందరు వాటిని మెడలో వేసుకోవడం, నడుముకు చుట్టుకోవడం వంటి పనులు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పామును పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా బ్రో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయిలాండ్‌లో (Thailand) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. ఆ పాము ఒక్కసారి కాటేసిందంటే.. ఇక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పాములను సైతం కొందరు స్నేక్ క్యాచర్లు ఎంతో సులభంగా పట్టుకోవడం చూస్తుంటాం.

Mosquito Coil Funny Video: ఎలా వస్తాయో ఇలాంటి విచిత్ర ఐడియాలు.. దోమలను తరిమి తరిమి కొడుతోందిగా..


తాజాగా, ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. పడగ విప్పిన కింగ్ కోబ్రా వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి ముందుగా.. తన కాలిని పాము దగ్గరగా పెట్టాడు. దీంతో ఆ పాము అతన్ని కాటేయడానికి ప్రయత్నించింది. అయితే ఇంతలో అతను తన చేయిని పాము తలపైకి మెల్లగా తీసుకెళ్లి, (Man catches King Cobra with bare hands) ఒక్కసారిగా దాని తల కింద పట్టేసుకుంటాడు. ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే.. ఒట్టి చేతులతో పామును ఎంతో సులభంగా పట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది కోబ్రా అనుకున్నావా.. లేక కోడి పిల్ల అనుకున్నావా బ్రో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎప్పటికైనా ప్రమాదమే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 07:15 AM